Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ సెట్లో విషాదం.. కరెంట్ షాక్‌తో యువ కార్మికుడు మృతి
రజనీకాంత్ జైలర్ 2(Jailer 2) సెట్స్‌లో విద్యుత్ ప్రమాదం వల్ల యువకుడు మృతి చెందాడు.
- V Santhosh Kumar
- Published on- May 15, 2026 / 11:25 AM IST
Electrical Accident on Rajinikanth Jailer 2 sets Young Man passed away
- జైలర్ 2 సెట్లో ఘోర ప్రమాదం.
- కరెంట్ షాక్‌తో కార్మికుడు మృతి.
- నిలిచిపోయిన రజనీకాంత్ చిత్ర షూటింగ్.
Jailer 2: సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’ షూటింగ్ సెట్లో జరిగిన ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై సమీపంలోని ఒక స్టూడియోలో భారీ సెట్ నిర్మిస్తున్న సమయంలో 28 ఏళ్ల కార్తికేయన్ అనే యువ కార్మికుడు విద్యుత్ షాక్‌కు గురై మరణించారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఈ విషాద ఘటనపై కనత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భారీ బడ్జెట్ చిత్రాల సెట్స్‌లో కార్మికుల భద్రతపై ఈ ప్రమాదం మరోసారి చర్చకు దారితీసింది.
Ram Pothineni: ‘వీర’గా రామ్ వైలెంట్ లుక్.. పుట్టినరోజున ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన ఎనర్జిటిక్ స్టార్!
నిజానికి ‘జైలర్ 2(Jailer 2)’ ప్రారంభం నుండి వరుస ఇబ్బందులను ఎదుర్కొంటోంది. గతంలో షూటింగ్ దృశ్యాలు లీక్ అవ్వడం సన్ పిక్చర్స్ సంస్థను కలవరపెట్టగా, ఇప్పుడు ప్రాణాంతక ప్రమాదం జరగడం షూటింగ్‌పై ప్రభావం చూపేలా ఉంది. వరుస అవాంతరాలతో చిత్ర యూనిట్ ఆందోళనలో ఉంది. కోట్ల రూపాయలు వెచ్చించే ఇటువంటి పెద్ద సినిమాల విషయంలో భద్రతా ప్రమాణాలు మరింత పటిష్టంగా ఉండాలని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కార్తికేయన్ మృతి పట్ల చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
