స్టేజ్‌పై స్టెప్పులేసిన ‘ప్రతిరోజూ పండగే’ టీమ్
‘తకిట తథిమి పుట్టినరోజే’ పాటకు చిత్ర యూనిట్ అంతా కలిసి వేదికపై స్టెప్పులేయడం విశేషం..

‘తకిట తథిమి పుట్టినరోజే’ పాటకు చిత్ర యూనిట్ అంతా కలిసి వేదికపై స్టెప్పులేయడం విశేషం..
సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామా.. ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో.. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మించాయి. ఇటీవల విడుదల చేసిన టీజర్, ట్రైలర్ అండ్ లిరికల్ సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ‘తకిట తథిమి పుట్టినరోజే’ పాటకు చిత్ర యూనిట్ అంతా కలిసి వేదికపై స్టెప్పులేయడం విశేషం. చిత్ర సమర్పకులు అల్లు అరవింద్ కూడా వీరితో కలిసి కాలు కదిపారు. సత్యరాజ్ హుషారుగా స్టెప్స్ వేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రెండు యాక్షన్ ఎపిసోడ్స్‌లో సాయి తేజ్ సిక్స్ ప్యాక్ లుక్‌లో కనిపించబోతున్నాడు. సాయి తేజ్ హోమం చేస్తుండగా వచ్చే యాక్షన్ సీన్, ఆ సీన్‌లో షర్ట్ లేకుండా ఫైట్ సీక్వెన్స్‌లో సిక్స్ ప్యాక్‌లో తేజ్ కనిపిస్తాడని సమాచారం. క్రిస్మస్ కానుకగా ‘ప్రతిరోజూ పండగే’ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Electrifying Moments from #PratiRojuPandaage Pre Release Event #PratirojuPandaageOnDec20th pic.twitter.com/G5PgMFWMm0
— BARaju (@baraju_SuperHit) December 16, 2019