Bigg Boss Elimination : శనివారమే బిగ్‌బాస్ లో ఎలిమినేషన్.. ఆదివారం ఇంకొకరు..

శనివారం ఎపిసోడ్ లో నాగార్జున ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పి షాక్ ఇచ్చాడు.

Elimination Happened in Bigg Boss 8 on Saturday one more elimination on Sunday

Bigg Boss Elimination : బిగ్‌బాస్ 8 తెలుగు సీజన్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మరో మూడు వారాల్లో ఈ షో అయిపోనుంది. అవినాష్ ఇప్పటికే ఫైనల్ కి వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళు కూడా టాప్ 5లో ఉండి ఫైనల్ కి వెళ్లాలని ఆడుతున్నారు. దీంతో షో మరింత రసవత్తరంగా జరుగుతుంది. అయితే నిన్న శనివారం ఎపిసోడ్ లో నాగార్జున ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పి షాక్ ఇచ్చాడు.

దీంతో శనివారం నాడు తక్కువ ఓట్లు వచ్చిన టేస్టీ తేజను ఎలిమినేట్ చేసారు. గతంలో ఓ సారి బిగ్‌బాస్ ఆడిన తేజ ఈ సారి వైల్డ్ కార్డు ఎంట్రీతో మళ్ళీ వచ్చాడు. ఫ్యామిలీ వీక్ వరకు అయినా ఉండాలి అనుకున్నాడు. అనుకున్నట్టే ఫ్యామిలీ వీక్ లో తేజ వాళ్ళ అమ్మ రాగా ఎమోషనల్ అయ్యాడు. ఈ వారం తేజ ఎలిమినేట్ అయిపోయాడు.

Also Read : Rajendra Prasad : ఇప్పుడు కామెడీలో బూతులు ఉన్నాయి.. కామెడీ స్టాండర్డ్స్ తగ్గిపోయాయి.. రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు..

నేడు ఆదివారం ఎపిసోడ్ లో ప్రేరణ ఎలిమినేట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. మరి ప్రేరణ ఎలిమినేట్ అవుతుందా లేక వేరే ఎవరన్నా ఎలిమినేట్ అవుతారా చూడాలి.