Rajendra Prasad : ఇప్పుడు కామెడీలో బూతులు ఉన్నాయి.. కామెడీ స్టాండర్డ్స్ తగ్గిపోయాయి.. రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు..

తాజాగా రాజేంద్రప్రసాద్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇప్పుడు వస్తున్న కామెడీపై స్పందించారు.

Rajendra Prasad : ఇప్పుడు కామెడీలో బూతులు ఉన్నాయి.. కామెడీ స్టాండర్డ్స్ తగ్గిపోయాయి.. రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు..

Rajendra Prasad Sensational Comments on Present Generation Comedy

Updated On : December 1, 2024 / 8:57 AM IST

Rajendra Prasad : కామెడీ సినిమాలు అన్నా, కామెడీ షోలు అన్నా అందరికి ఇష్టమే చిన్నపిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ళ వరకు అంతా కలిసి చూడొచ్చు. అయితే ఇటీవల కామెడీకి అర్ధం మారిపోయింది. కొన్ని బూతు డైలాగ్స్, అడల్ట్ జోక్స్, బాడీ షేమింగ్ లాంటివి ఎక్కువగా ప్రస్తావిస్తూ వాటిపైనే కామెడీ తీసుకొస్తున్నారు. ఇప్పుడొచ్చే సినిమాల్లోనూ, టీవీ షోలలో కూడా అదే జరుగుతుంది.

ఇక జబర్దస్త్ లాంటి షోలలో అయితే డబల్ మీనింగ్ డైలాగ్స్ తోనే కామెడీ చేయాలని చూస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు, ఒకప్పటి స్టార్ కామెడీ హీరో రాజేంద్రప్రసాద్ ఇప్పటి కామెడీపై సంచలన వ్యాఖ్యలు చేసారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇప్పుడు వస్తున్న కామెడీపై స్పందించారు.

Also Read : Game Changer: గేమ్ ఛేంజర్ పార్ట్ 2 రాబోతుందా?

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. మీరేమన్నా అనుకోండి కానీ ఈ రోజుల్లో కామెడీ స్టాండర్డ్ తగ్గింది. బూతులు వాడి కామెడీ స్టాండర్డ్ తగ్గించారు. ఒకప్పుడు జంధ్యాల, రేలంగి, evv సత్యనారాయణ.. లాంటి దర్శకులు కామెడీ బాగా రాసారు. అప్పట్లో రాసే కామెడీ పిల్లలు కూడా చూసేవాళ్ళు. అందరు చూడగలిగేలా సినిమాలు చేయాలి, అందులో కామెడీ ఉండాలి. గతంలో నేను చేసిన కొన్ని సినిమాల్లో రెండు మూడు సార్లు బూతులతో ఉన్న కామెడీ డైలాగ్స్ వస్తే నేను చెప్పను అని చెప్పి రిక్వెస్ట్ చేసి మార్పించుకున్నాను. నేను అలాంటి కామెడీ చేయను అని అన్నారు. దీంతో రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు టాలీవుడ్ లో వైరల్ గా మారాయి. మరి ఈయన కామెంట్స్ తర్వాత అయినా బూతులతో, డబల్ మీనింగ్ డైలాగ్స్ తో కామెడీ చేసేవాళ్ళు తగ్గిస్తారేమో చూడాలి.