Game Changer: గేమ్ ఛేంజర్ పార్ట్ 2 రాబోతుందా?
ఈ మధ్య పాన్ ఇండియా మూవీస్ చాలా వరకు సక్సెస్ అవడంతో పార్ట్-2లుగా తీస్తున్నారు మేకర్స్.

Ram Charan Game Changer
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా కియారా అద్వానీ.. అంజలి ఫీమేల్ లీడ్‌లో రాబోతున్న గేమ్‌ఛేంజర్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎగ్జైట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నారు. డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ మూవీ నుంచి ఇప్పటికే టీజర్..మూడు పాటలు అంచనాలను పెంచేస్తున్నాయి. అయితే ఈ సినిమాపై లేటెస్ట్‌గా కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
నిజానికి గేమ్‌ఛేంజర్ అనుకున్న దానికంటే చాలా ఆలస్యంగా వస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఎంతకీ పూర్తి కాకుండా నెమ్మదిగా కొనసాగడంతో రెండు పార్టులుగా తీస్తున్నారంటూ చర్చ జరిగింది. అందుకు తగ్గట్లుగా గేమ్‌ఛేంజర్-2 కూడా రాబోతుందన్న టాక్ వినిపిస్తోంది. 2025 జనవరి 10న వరల్డ్ వైడ్‌గా గేమ్‌ఛేంజర్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే టీజర్, కొన్ని సాంగ్స్ రిలీజ్ అయి మంచి హిట్ అయ్యాయి. ఇంకా ప్రమోషన్స్ భారీగా ప్లాన్ చేశారు మేకర్స్. అయితే బాహుబలి-2, పుష్ప-2 లాగే..గేమ్‌ఛేంజర్ కూడా పార్ట్-2 రాబోతుందన్న న్యూస్ వైరల్ అవుతోంది.
ఈ మధ్య పాన్ ఇండియా మూవీస్ అన్ని సక్సెస్ అవడంతో పార్ట్-2లుగా తీస్తున్నారు మేకర్స్. ఇప్పుడు గేమ్‌ఛేంజర్‌పై ఫుల్ కాన్ఫిడెంట్‌తో ఉన్న మేకర్స్ పార్ట్-2 లీడ్ కూడా ఇవ్వబోతున్నారంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో గేమ్‌ఛేంజర్ మేకర్సే క్లారిటీ ఇవ్వాలి. ఒకవేళ పార్ట్-2 ఉంటే ఇప్పట్లో అయితే కష్టమేనన్న చర్చ జరుగుతోంది.
రామ్‌చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత సుకుమార్‌తో మరో ప్రాజెక్ట్ అనుకుంటున్నారు. ఆ తర్వాతే గేమ్‌ఛేంజర్-2 చేసే అవకాశం ఉంటుందంటున్నారు. ఇప్పటికైతే జనవరి 10న రిలీజ్ కాబోతున్న గేమ్‌ఛేంజర్ కోసం ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ కూడా చాలా ఎగ్ఝైట్‌మెంట్‌తో ఎదురు చూస్తోంది.
Pawan Kalyan : సుజిత్ సినిమాటిక్ యూనివర్స్.. పవన్ ఓజిలో ప్రభాస్ నిజంగానే ఉన్నడా?