Site icon 10TV Telugu

Actor Shwetha Menon: సినిమాల్లో అశ్లీల, అసభ్యకర కంటెంట్..! నటి శ్వేతా మీనన్‌పై కేసు నమోదు..

Actor Shwetha Menon

Actor Shwetha Menon: అసభ్యకరమైన, అశ్లీల కంటెంట్ ఉన్న సినిమాల్లో తన పాత్రల ద్వారా ఆర్థిక లాభాలు ఆర్జించినందుకు కేరళలోని ఎర్నాకుళం సెంట్రల్ పోలీసులు నటి శ్వేతా మీనన్‌పై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 67A కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఎర్నాకులం స్థానికుడైన మార్టిన్ మెనాచేరి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎర్నాకులం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు పోలీసులకు ఈ ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. పోలీసులు ఎఫ్ఐఆర్‌లో అనైతిక ట్రాఫిక్ (నివారణ) చట్టంలోని 5, 3 సెక్షన్లను కూడా చేర్చారు.

ఆర్థిక లాభాల కోసం అసభ్యకరమైన, అశ్లీల కంటెంట్ ఉన్న సినిమాల్లో పాత్రలు పోషించారని ఎఫ్ఐఆర్ లో ఆరోపించారు. ఆ కంటెంట్‌ ప్రజాదరణ పొందేందుకు సోషల్ మీడియా, అడల్ట్ సైట్‌ల ద్వారా ప్రసారం చేశారని, సంపాదన కోసం అలాంటి కంటెంట్‌ను వాణిజ్యపరంగా దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

యాక్టర్ పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభిస్తామని పోలీసులు తెలిపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 67 ఎ.. ఎలక్ట్రానిక్ రూపంలో లైంగిక అసభ్యకరమైన చర్యలను కలిగి ఉన్న విషయాలను ప్రచురించడం లేదా ప్రసారం చేయడం గురించి వ్యవహరిస్తుంది. సాల్ట్ ఎన్’ పెప్పర్, పలేరి మాణిక్యం: ఒరు పతిరకోలపాఠకతింటే కథ, రథినిర్వేదం, కలిమన్ను వంటి సినిమాల్లో పని ఆమె యాక్ట్ చేశారు.

Also Read: ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిలో వేతనాలు పెంచలేము.. మైత్రీ నిర్మాత కామెంట్స్ వైరల్..

Exit mobile version