Mythri Naveen : ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిలో వేతనాలు పెంచలేము.. మైత్రీ నిర్మాత కామెంట్స్ వైరల్..

తాజాగా ఈ సమస్య పై టాలీవుడ్ అగ్ర నిర్మాత సంస్థల్లో ఒకటైన మైత్రీ నిర్మాత నవీన్ మాట్లాడారు.

Mythri Naveen : ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిలో వేతనాలు పెంచలేము.. మైత్రీ నిర్మాత కామెంట్స్ వైరల్..

Mythri Naveen

Updated On : August 6, 2025 / 10:27 PM IST

Mythri Naveen : టాలీవుడ్ లో ప్రస్తుతం అనధికార సమ్మె నడుస్తుంది. ఏకంగా వేతనాలు 30 శాతం పెంచేదాకా సినీ కార్మికులు ఎవరూ షూటింగ్స్ కి వెళ్ళొద్దని ఫిలిం ఫెడరేషన్ చెప్పడంతో షూటింగ్స్ నిలిచిపోయాయి. దీంతో ఫిలిం ఛాంబర్, నిర్మాతలు ఈ సమస్య పరిష్కారానికి ట్రై చేస్తున్నారు. నిర్మాతలు మాత్రం ఈ సమ్మెకు, వేతనాల పెంపుకు వ్యతిరేకంగానే ఉన్నారు.

తాజాగా ఈ సమస్య పై టాలీవుడ్ అగ్ర నిర్మాత సంస్థల్లో ఒకటైన మైత్రీ నిర్మాత నవీన్ మాట్లాడారు. నేడు జరిగిన సు ఫ్రమ్ సో కన్నడ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నవీన్ మాట్లాడుతూ.. ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిలో వేతనాలు పెంచే అవకాశం లేదు. ఇండస్ట్రీలో సినిమాలకు రిటర్న్స్ బాగా తగ్గాయి. OTT బిజినెస్ లు లేవు. ఎలా చేస్తే మాకు షూటింగ్ కాస్ట్ తగ్గుతుందో అదే చేస్తాము. కొత్తవాళ్లను తీసుకోవాలా, యూనియన్స్ తో వెళ్లాలా అనేది చూస్తాము అని తెలిపారు.

Also Read : GHAATI : అనుష్క శెట్టి ‘ఘాటి’ ట్రైల‌ర్ వ‌చ్చేసింది..

దీంతో నిర్మాతలు ఇప్పుడు ఉన్న సినీ పరిశ్రమ గడ్డుకాలాన్ని సృష్టిలో పెట్టుకొని వేతనాలు పెంచే ఆలోచనలో అయితే లేరని తెలుస్తుంది. మరి ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి.