Eternals Movie : ఒకే స్క్రీన్‌పై 10 మంది సూపర్ హీరోస్..

మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న 25వ సినిమా ‘ఎటర్నల్స్’.. దీపావళి కానుకగా నవంబర్ 5న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది..

Eternals Movie : ఒకే స్క్రీన్‌పై 10 మంది సూపర్ హీరోస్..

Eternals

Updated On : October 18, 2021 / 2:40 PM IST

Eternals Movie: ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న 25వ సినిమా ‘ఎటర్నల్స్’. ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఒకే స్క్రీన్‌పై 10 మంది సూపర్ హీరోస్‌ను ప్రేక్షకులకు చూపించబోతున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 5న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ‘ఎటర్నల్స్’ మూవీ రిలీజ్ కానుంది.

Most Eligible Bachelor : అఖిల్ కోసం అల్లు అర్జున్

కొంత మంది సూపర్ హీరోలు గ్రూపులుగా ఏర్పడి.. భూమిని, భూమిపై ఉన్న మనుషులను కాపాడుతారు. వాళ్లను ‘ఎటర్నల్స్’ అంటారు. ఏదైనా విపత్తు వచ్చినప్పుడు వాళ్లే ముందుంటారు. మనుషుల్లోని మానవత్వాన్ని బయటికి తీసుకొచ్చి అందరికీ సాయం చేస్తారు. మార్వెల్ స్టూడియోస్ ‘ఎటర్నల్స్’ సినిమాలో గెమ్మా ఛాన్, రిచర్డ్ మేడెన్, కుమాల్ నాంజాయిని, లియా మేక్ హ్యూజ్, బ్రెయిన్ టైరి హెన్రీ, లరెన్ రిడల్ఫ్, బ్యారీ కాగన్, డాన్ లీ, కిట్ హరింగ్టన్, సల్మా హాయక్, అకాడమీ అవార్డు గ్రహీత ఏంజెలీనా జోలీ నటిస్తున్నారు.

Chiranjeevi : కుడి చేతికి సర్జరీ చేశారు.. అభిమానులు ఆందోళన చెందకండి..

ఈ సినిమాను కెవిన్ ఫీజ్, నెట్ మూరె నిర్మిస్తున్నారు. గతేడాది ‘నోమద్ ల్యాండ్’ సినిమాతో అకాడమీ అవార్డు గెలుచుకున్న క్లో ఝా ‘ఎటర్నల్స్’ సినిమాను తెరకెక్కించారు.
ఒలంపియా గ్రహం నుంచి వేలాది సంవత్సరాల క్రితం భూమిపైకి వచ్చిన మరణం లేని ఏలియన్స్ ఈ ‘ఎటర్నల్స్’. వీళ్ళనే డేవిఎంట్స్ అంటారు. మానవత్వాన్ని కాపాడడమే వీళ్ళ పని. ‘ఎటర్నల్స్’ కు ఎన్నో పవర్స్ ఉంటాయి. వాళ్లలో అందరు సూపర్ హీరోలు ఒకే రకమైన శక్తి కలిగి ఉంటారు. అందులో కొంతమంది ఆలోచించే వాళ్ళు.. మరికొంతమంది శక్తివంతులు.. ఇంకొందరు ఫైటర్స్ ఉంటారు. కానీ ఈ గ్రూప్‌లో అందరికీ సమానమైన శక్తులు ఉంటాయి.

Shyam Singha Roy : నాలుగు భాషల్లో నాని సినిమా

మార్వల్ యూనివర్స్‌లో ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా ఒక మైథాలజీ సినిమాకి సైంటిఫిక్ జోనర్‌ను యాడ్ చెయ్యడం సవాల్ లాంటిదని చెప్పొచ్చు. ఆడియన్స్ పాయింటాఫ్ వ్యూలో ఆలోచిస్తే ‘అవెంజర్స్’ కంటే ‘ఎటర్నల్స్’ లోని ఈ 10 మంది సూపర్ హీరోలు చాలా శక్తివంతులు. ‘ఎటర్నల్స్’ గ్రూప్‌లో ఉన్న పది మందిలో ఐదుగురు ఆడవాళ్లు, ఐదుగురు మగవాళ్లు సమానంగా ఉన్నారు. క్యారెక్టర్ల పరంగా మరే సూపర్ హీరో సినిమాలోనూ ఇంత సమన్యాయం జరగలేదు.

Eternals Movie