Suhani Bhatnagar : 19 ఏళ్లకే మరణించిన సుహానీ భట్నాగర్ ఎవరు? దంగల్ తర్వాత సినిమాలకు ఎందుకు దూరమైంది?

సుహానీ భట్నాగర్ 19 సంవత్సరాల చిన్న వయసులో మరణించడం అందర్నీ షాక్‌కి గురి చేసింది. దంగల్ సినిమా తర్వాత నటనకు దూరంగా ఉన్న సుహానీ ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆమె మరణానికి కారణమేంటి? అని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు.

Suhani Bhatnagar : ‘దంగల్’ లో చైల్డ్ ఆర్టిస్ట్ బబితా ఫోగట్ పాత్రలో నటించిన సుహానీ భట్నాగర్ మరణం అందర్నీ షాక్‌కి గురి చేసింది. 19 సంవత్సరాల అతి చిన్న వయసులో సుహానీ కన్నుమూసారు. అసలు సుహానీ ఎవరు? దంగల్ తర్వాత సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నారు? ఆమె మరణానికి పూర్తి కారణాలేంటి?

Ram Charan : ‘ఆరెంజ్’ పాటలకి ఇంతటి క్రేజ్ ఉందా..? ఈ వైరల్ వీడియో చూశారా..!

దంగల్ సినిమాలో బబితా ఫోగట్ పాత్రలో నటించిన దీప్తి భట్నాగర్ మరణించారు. ఇంత చిన్న వయసులో ఆమె మరణం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. సుహానీ కుటుంబం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతోంది. కన్నీరు మున్నీరవుతోంది. అనేకమంది అసలు సుహానీకి ఏమైందో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు.  నిజానికి సుహానికి కొంతకాలం క్రితం జరిగిన ప్రమాదంలో కాలు ప్రాక్చర్ అయ్యిందట. అందుకోసం వాడిన మందులు రియాక్షన్ కావడంతో బాడీ అంతా నీరు పట్టిందట. ఇటీవల కాలంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సుహాని ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ట్రీట్మెంట్‌లో ఉండగానే ఈరోజు చనిపోయారు. సుహానీ తన ఫ్యామిలీతో ఫరీదాబాద్ లో ఉంటున్నారు. ఆమె అంత్యక్రియలు సెక్టార్ 15 లోని అజ్రౌండా స్మశాన వాటికలో జరగనున్నాయని సమాచారం.

OoruPeru Bhairavakona : సందీప్ కిషన్ ‘ఊరుపేరు భైరవకోన’.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

సుహానీ భట్నాగర్ 2016 లో అమీర్ ఖాన్ సినిమా ‘దంగల్’ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో బబితా ఫోగట్ పాత్రలో కనిపించారు. ఈ సినిమా చేయడానికి ముందు తను కొన్ని యాడ్స్‌లో కూడా నటించారు. సుహానీకి తల్లి పూజాభట్నాగర్, తమ్ముడు ఉన్నారు. దంగల్ సినిమా తర్వాత సుహానీకి చాలానే సినిమా ఆపర్లు వచ్చినా చదువు మీద ఉన్న ఆసక్తితో ఆమె అంగీకరించలేదట. దంగల్ సినిమాలోని బబితా ఫోగట్ పాత్రకు స్టార్ స్క్రీన్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు అందుకున్నారు సుహానీ. సుహానీ చాలా సాధారణమైన జీవితం గడిపారట. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండేవారు కాదు. 2021 నుండి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్టు కూడా చేయలేదు. అనేక ఇంటర్వ్యూలలో తాను చదువు పూర్తి చేసి ఇండస్ట్రీకి తిరిగి వస్తానని చెప్పిన సుహానీ..తన కల నెరవేరకముందే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.

 

ట్రెండింగ్ వార్తలు