Fahadh Faasil playing villain role in Anil Ravipudi next film.
Anil Ravipudi: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే ఒక పేరు వినిపిస్తోంది. అదే దర్శకుడు అనిల్ రావిపూడి పేరు. రీసెంట్ గా ఆయన చేసిన సినిమా మన శంకర వరప్రసాద్ గారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఈ సినిమా సంక్రాంతికి వచ్చి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కేవలం పది రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ సినిమా.
దీంతో, టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi)కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఆయనతో సినిమాలు చేసేందుకు మేకర్స్ అంతా క్యూ కడుతున్నారు. ఈ నేపధ్యంలోనే అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా గురించి అనేకరకాల న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన నెక్స్ట్ సినిమాను పవన్ కళ్యాణ్ తో చేస్తున్నారు అని, రానాతో చేస్తున్నాడు అంటూ చాలా రకాల న్యూస్ వినిపిస్తున్నాయి.
Pragya Jaiswal: ఆకుపచ్చ డ్రెస్సులో అందాల ఆరబోత.. ప్రగ్యా గ్లామర్ షో పీక్స్.. ఫొటోలు
కానీ, దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు, ఆయన తన కామెడీ జానర్ నుంచి బయటకు వచ్చి సరికొత్త జానర్ లో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడట. ఈ ప్రాజెక్టు చేయడానికి చాలా ఆతృతగా ఉన్నాడట అనిల్ రావిపూడి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.
అయితే, ఏ హీరోతో చేయబోతున్నాడు అనేది మాత్రం రివీల్ చేయలేదు. అయితే, ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి ఒక న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అదేంటంటే, అనిల్ తన నెక్స్ట్ సినిమాలో విలన్ గా మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ ను తీసుకోనున్నాడట. ఇప్పటికే ఆయనతో చర్చలు కూడా జరిగాయని తెలుస్తోంది. కథ విన్న వెంటనే ఫహద్ కూడా ఒకే చెప్పేశాడట. ప్రస్తుతం ఆయనకు సంబందించిన లుక్ టెస్ట్ జరుగుతుందట. నిజానికి, ఇలా హీరో సెట్ కాకుండానే విలన్ సెట్ అవడం అంటే వింతే అని చెప్పాలి. ఇదే గనక నిజం అయితే, కాంబినేషన్ తోనే అనిల్ మరో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.