Site icon 10TV Telugu

Fahadh Faasil : ఇంకా కీప్యాడ్ ఫోన్ వాడుతున్న పుష్ప విలన్.. కానీ ఫోన్ ధర మాత్రం లక్షల్లో..

Fahadh Faasil Uses old Keypad Phone Vertu Ascent Ti Model

Fahadh Faasil

Fahadh Faasil : ఇప్పుడు అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ప్రపంచం మన గుప్పిట్లో ఉంది. ఈ రోజుల్లో కీప్యాడ్ ఫోన్స్ వాడేవాళ్లు చాలా అరుదు. ఇక సెలబ్రిటీలు అయితే ఐ ఫోన్స్, ఖరీదైన స్మార్ట్ ఫోన్స్ వాడతారు. అలాంటిది పుష్ప విలన్, మలయాళం స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్ మాత్రం ఇంకా కీప్యాడ్ ఫోన్ వాడుతున్నాడు.

ఇటీవల ఫాహద్ ఫాజిల్ తన కొత్త సినిమా ఓపెనింగ్ కి రాగా ఫోన్ వస్తే తీసి మాట్లాడాడు. దాంతో ఆ విజువల్స్ వైరల్ గా మారాయి. ఎందుకంటే ఫాహద్ పట్టుకుంది ఒక కీప్యాడ్ ఫోన్. అయితే దీని కాస్ట్ మాత్రం లక్షల్లోనే ఉంది. ఫాహద్ కి సోషల్ మీడియా అకౌంట్స్ లేవని తెలిసిందే. ఇప్పుడు ఫాహద్ కీప్యాడ్ ఫోన్ వాడటం చూసి అందుకే అతనికి సోషల్ మీడియా అకౌంట్స్ లేవేమో అని అనుకుంటున్నారు.

Also Read : Nihar Kapoor : ‘బాహుబలి’లో రానా పాత్ర నేను చేయాలి.. మూడు వారాల ట్రైనింగ్ అయ్యాక.. ఇతనెవరో తెలుసా?

అయితే ఫాహద్ వాడిన ఫోన్ Vertu కంపెనీ Ascent Ti మోడల్. ఇంగ్లాండ్ కి చెందిన కంపెనీ ఫోన్ ఇది. దీని ధర దాదాపు 4 లక్షల రూపాయలు ఉంటుందని సమాచారం. దీంతో అంతా 4 లక్షలు ఖర్చుపెట్టి కీప్యాడ్ ఫోన్ వాడుతున్నాడా అని ఆశ్చర్యపోతున్నారు. 2008 లో ఈ ఫోన్ ని లాంచ్ చేసారు. ఇంత ఖర్చుపెట్టి కీప్యాడ్ ఫోన్ ఎందుకు వాడుతున్నాడో, సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉంటున్నాడో ఆయనకే తెలియాలి అని ఫ్యాన్స్, నెటిజన్లు అంటున్నారు.

Also Read : Naga Vamsi : ఆ రెండు సినిమాలు నేను చేసిన ఖరీదైన తప్పులు.. శర్వానంద్, వైష్ణవ తేజ్ సినిమాలపై నిర్మాత కామెంట్స్..

Exit mobile version