Naga Vamsi : ఆ రెండు సినిమాలు నేను చేసిన ఖరీదైన తప్పులు.. శర్వానంద్, వైష్ణవ తేజ్ సినిమాలపై నిర్మాత కామెంట్స్..
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ అన్ని మంచి సినిమాలే తెరకెక్కిస్తూ హిట్స్ కొడుతున్నాడు.

Naga Vamsi
Naga Vamsi : సినీ పరిశ్రమలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయని ముందే తెలుస్తుంది. కానీ ఎలాగో డబ్బులు పెట్టేసాం కదా అని రిలీజ్ చేస్తారు. కొన్ని ప్రయోగాత్మకంగా చేద్దాం అనుకున్న సినిమాలు కూడా ఫ్లాప్ అవుతుంటాయి. తాజాగా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న నిర్మాత నాగవంశీ తన కెరీర్ లో రెండు సినిమాలు నేను చేసిన ఖరీదైన తప్పులు అని అన్నారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ అన్ని మంచి సినిమాలే తెరకెక్కిస్తూ హిట్స్ కొడుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను తెలిసి తెలిసి తప్పు చేసిన సినిమా రణరంగం. అప్పటికి మా బాబాయ్ చెప్పారు. శర్వానంద్ చిన్నపిల్లాడిలా ఉంటాడు, లవర్ బాయ్ ఇమేజ్ ఉంది, ఏజ్డ్ క్యారెక్టర్ వద్దు అని. కానీ నేను, డైరెక్టర్ సుధీర్ కొత్తగా ఉంటుందని ట్రై చేసాము. కానీ ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు. రవితేజ లాంటి వాళ్ళతో ఆ సినిమా చేస్తే హిట్ అయ్యేదేమో అని అన్నారు.
Also Read : Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో మరో హీరోయిన్.. పవన్ కళ్యాణ్ పక్కన ఎవరంటే.. మొదటిసారి..
అలాగే.. ఆదికేశవ సినిమా కూడా తెలిసి తప్పు చేశాను. ఆ సినిమాని రిపేర్ చేసేందుకు చాలా ట్రై చేసాం కానీ కుదరలేదు. ఈ రెండు సినిమాలు నా కెరీర్లో ఖరీదైన తప్పులు అని అన్నారు. శర్వానంద్ చేసిన రణరంగం, వైష్ణవ తేజ్ చేసిన ఆదికేశవ సినిమాలు ఫ్లాప్స్ గా మిగిలాయి.