Nihar Kapoor : ‘బాహుబలి’లో రానా పాత్ర నేను చేయాలి.. మూడు వారాల ట్రైనింగ్ అయ్యాక.. ఇతనెవరో తెలుసా?
నటుడు నిహార్ కపూర్ బాహుబలిలో రానా చేసిన భల్లాల దేవా పాత్ర, కాలకేయ పాత్ర నేను చేయాలి అంటూ ఆసక్తికర విషయం చెప్పాడు.

Nihar Kapoor
Nihar Kapoor : సినీ పరిశ్రమలో ఒకరి ఛాన్సులు ఒకరికి వెళ్తూనే ఉంటాయి. ఒకరు చేయాల్సిన సినిమాలు పలు కారణాలతో ఇంకొకరు చేస్తారు. తాజాగా నటుడు నిహార్ కపూర్ బాహుబలిలో రానా చేసిన భల్లాల దేవా పాత్ర, కాలకేయ పాత్ర నేను చేయాలి అంటూ ఆసక్తికర విషయం చెప్పాడు.
సీనియర్ నటి జయసుధ తనయుడు నిహార్ కపూర్ హీరోగా ఓ రెండు సినిమాలు చేసాడు. వాటికంటే ముందే అతనికి బాహుబలిలో ఛాన్స్ వచ్చింది.
నిహార్ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాహుబలి సినిమాలో రానా పాత్ర నాకు వచ్చింది. మొదట రానానే అనుకున్నారు. కానీ రానా డేట్స్ లేకపోవడంతో నా హైట్, బాడీ చూసి నన్ను తీసుకున్నారు. మూడు వారాలు ట్రైనింగ్ కూడా తీసుకున్నాను ఆ పాత్ర కోసం. కానీ తర్వాత మళ్ళీ రానా వచ్చేయడంతో అతన్నే తీసుకున్నారు. నాకు కాలకేయ పాత్ర ఆఫర్ చేసారు. ఆ పాత్ర ఇలా ఉంటుంది అని కొన్ని స్కెచెస్ చూపించారు. వాలు చూపించిన స్కెచెస్ లో ఆ పాత్రకి ఫేస్ కనిపించదు అనిపించింది. దాంతో అమ్మ మొదటి సినిమాలో ఫేస్ కనిపించకుండా ఎందుకు వద్దు అంది. అందుకే నేను కాలకేయ పాత్రకు నో చెప్పాను. తర్వాత సినిమాలో ఫేస్ కనపడేలానే ఉంది ఆ పాత్ర. కాలకేయ క్యారెక్టర్ కి కూడా మంచి పేరు వచ్చింది అని తెలిపాడు. ఒకవేళ ఆ రెండు పాత్రల్లో నిహార్ ఏ క్యారెక్టర్ చేసినా ఇప్పటికి మంచి నటుడిగా సెటిల్ అయ్యేవాడేమో.
"I was approached for the Bhallaladeva role in #Baahubali. After a few weeks of training, they finalised #RanaDaggubati and offered me Kalakeya instead."
– Jayasudha's son #NiharKapoor
pic.twitter.com/2w9kmdjVnf— Whynot Cinemas (@whynotcinemass_) July 20, 2025
Also Read : Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో మరో హీరోయిన్.. పవన్ కళ్యాణ్ పక్కన ఎవరంటే.. మొదటిసారి..