ఇదీ నిజం: ఫేక్ ఫొటోలు పోస్ట్ చేసిన RGV

రామ్ గోపాల్ వర్మ.. సంచలన వ్యాఖ్యలు, కాంట్రవర్శీ కామెంట్లు చేయడంలో ఆరితేరిన దిట్ట. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ఏపీలో ఓ రేంజ్ కాంట్రవర్శీ క్రియేట్ చేసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు దేశ రాజకీయాలపై సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటిదాకా చంద్రబాబును, లోకేశ్‌ను మాత్రమే టార్గెట్ చేసిన వర్మ.. ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ ఓ వివాదాస్పద ఫోటోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు.
Same to same pic.twitter.com/ZFdqBq4pED
— Ram Gopal Varma (@RGVzoomin) May 2, 2019
ఆ ట్వీట్‌లో మోడీ, హిట్లర్ సేమ్ టూ సేమ్ అంటూ కామెంట్ చేశారు. రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన జర్మనీ అధినేత అడాల్ఫ్ హిట్లర్‌తో ప్రధాని నరేంద్ర మోడీని పోల్చడంతో నెటిజన్లు వర్మపై విరుచుకుపడుతున్నారు. అప్పట్లో హిట్లర్ ఓ చిన్నపాపతో దిగిన ఫోటోని.. ప్రధాని మోడీ ఓ విదేశీ యాత్రలో చిన్నారితో తీసుకున్న ఫోటో అంటూ మరో మార్ఫింగ్ ఫోటోను పోల్చుతూ పోస్ట్ చేశారు.
What are your thoughts? pic.twitter.com/b8GcgKL2ih
— Divya Spandana/Ramya (@divyaspandana) April 29, 2019
ఇదిలా ఉంటే వర్మ పోస్ట్ చేసిన ఫోటోలో హిట్లర్ ఫొటో అసలైనది కాదని, మార్ఫింగ్ చేసిందని, మోడీ ఫోటోను మార్ఫింగ్ చేసినట్లు గుర్తించారు. మార్ఫింగ్ చేసిన ఒరిజినల్ ఫోటోను మాజీ కాంగ్రెస్ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నిర్వాహకురాలు దివ్య స్పందన పోస్ట్ చేశారు. అయితే హిట్లర్, మోడీ ఇద్దరూ పిల్లల చెవులు మెలి పెట్టినట్లుగా ఉండగా అవి ఫేక్ అని తేలంది.