ఫలక్‌నామా దాస్ : ట్రైలర్ అదిరిపోయింది

విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా ఫలక్‌నామా దాస్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది..

  • Published By: sekhar ,Published On : May 13, 2019 / 07:13 AM IST
ఫలక్‌నామా దాస్ : ట్రైలర్ అదిరిపోయింది

Updated On : May 13, 2019 / 7:13 AM IST

విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా ఫలక్‌నామా దాస్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది..

పక్కా హైదరాబాదీ నేటివిటీతో రూపొందిన సినిమా ఫలక్‌నామా దాస్.. వెళ్ళిపోమాకే మూవీతో హీరోగా పరిచయమై, ఈ నగరానికి ఏమైంది సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్నాడు. సలోని మిశ్రా, హర్షిత గౌర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మూవీ టీజర్‌అండ్ సాంగ్స్‌కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడీ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది. విశ్వక్ సేన్ పక్కా హైదరాబాదీ కుర్రాడిగా అదరగొట్టేసాడు. అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ బాగున్నాయి. జనరల్‌గా యూజ్ చేసే బూతు పదాలు వాడారు ట్రైలర్‌లో..

గ్యాంగ్‌లు, గొడవలు.. లోకల్ కుర్రాళ్ళ మధ్య జరిగే ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమా రూపొందినట్టు అర్థమవుతుంది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో, వన్మయి క్రియేషన్స్ బ్యానర్‌పై కరాటే రాజు నిర్మిస్తున్నాడు. ఉత్తేజ్, తరుణ్ భాస్కర్ తదితరులు కీలక పాత్రలు చేసారు. ఈ సినిమాకి సంగీతం : వివేక్ సాగర్, కెమెరా : విద్యా సాగర్ చింతా, ఎడిటింగ్ : రవితేజ, లిరిక్స్ : సుద్దాల అశోక్ తేజ, భాస్కరభట్ల, కిట్టు విస్సాప్రగడ, ఆర్ట్ : అఖిల పెమ్మసాని, తరుణ్, వినోద్. 

వాచ్ ట్రైలర్..