Pratyusha Garimella : ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల అనుమానాస్పద మృతి

బంబారాహిల్స్ లోని ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడిన గదిలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్బన్ మోనాక్సైడ్ ను పీల్చుకోవడం వల్లే మృతి చెంది ఉండవచ్చని ప్రాథమికంగా గుర్తించారు.

Pratyusha Garimella : ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల అనుమానాస్పద మృతి

Pratyusha

Updated On : June 11, 2022 / 9:04 PM IST

Pratyusha Garimella : ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల అనుమానాస్పద మృతి చెందారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ప్రత్యూష గదిలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ లభ్యమైంది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బంబారాహిల్స్ లోని ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడిన గదిలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్బన్ మోనాక్సైడ్ ను పీల్చుకోవడం వల్లే మృతి చెంది ఉండవచ్చని ప్రాథమికంగా గుర్తించారు. ఐపీసీ 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Actress Commits Suicide : నటి ఆత్మహత్య-డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని నకిలీ అధికారుల బెదిరింపు

ఎంతోమంది హీరోయిన్లు, సెలబ్రిటీలకు ప్రత్యూష కాస్టూమ్స్ డిజైన్ చేశారు. శృతిహాసన్, దీపికా పడుకోన్, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధాదాస్, కాజల్, కీర్తి సురేష్, కృతి కర్బందా, ఉపాసన, ప్రగ్యా జైస్వాల్ కు కాస్టూమ్స్ డిజైన్ చేశారు. 2013 నుంచి తన పేరు మీదే ప్రత్యూష కాస్టూమ్స్ డిజైన్ చేస్తున్నారు.