Actress Commits Suicide : నటి ఆత్మహత్య-డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని నకిలీ అధికారుల బెదిరింపు

ఫైవ్ స్టార్ హోటల్ లో ఉన్న హుక్కాపార్లర్ లో జరిగే పార్టీకి హాజరైంది ఒక యువ నటి. అది చూసిన నకిలీ ఎన్సీబీ అధికారులు ఆమెను బెదిరించటంతో 28 ఏళ్ల యువనటి ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబై లో చ

Actress Commits Suicide : నటి ఆత్మహత్య-డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని నకిలీ అధికారుల బెదిరింపు

Actress Commits Suicide

Actress Commits Suicide :  ఫైవ్ స్టార్ హోటల్ లో ఉన్న హుక్కాపార్లర్ లో జరిగే పార్టీకి హాజరైంది ఒక యువ నటి. అది చూసిన నకిలీ ఎన్సీబీ అధికారులు ఆమెను బెదిరించటంతో 28 ఏళ్ల యువనటి ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబై లో చోటు చేసుకుంది.

భోజ్‌పురి సినిమాల్లో నటించే 28 ఏళ్ల యువతి జోగేశ్వరి (వెస్ట్)లో నివసిస్తోంది. డిసెంబర్ 20న తన ముగ్గురు స్నేహితులతో కలిసి శాంతాక్రజ్(వెస్ట్)లోని ఒక ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఉన్న హుక్కా పార్లర్‌కు వెళ్లింది. అక్కడ జరిగే పార్టీలో పాల్గోంది. పార్టీకి వచ్చిన ఇద్దరు వ్యక్తులు తాము నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులమని ఆ యువతితో చెప్పి…. మాదక ద్రవ్యాలు తీసుకున్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పారు. దీంతో ఆ యువతి భయపడి అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయింది.

దీంతో వారిద్దరూ   ఆనటిని ఫోన్‌లో బెదిరించసాగారు. డ్రగ్స్ కేసులో   పేరు లేకుండా  చేయాలంటే రూ.40 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు రూ.20 లక్షలు ఇచ్చేట్టు బేరం కుదుర్చుకున్నారు. ఈవిషయం తన ముగ్గురు స్నేహితులకు ఆమె చెప్పింది. ఈలోగా ఎన్సీబీ అధికారులు‌గా పరిచయం చేసుకున్న  వ్యక్తులు ఆ నటిని డబ్బుల కోసం వేధించసాగారు. వారి వేధింపులు తట్టుకోలేని యువ నటి డిసెంబర్ 23న తాను నివాసం ఉంటున్న ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన అంబోలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

ఆమె ఫోన్ స్వాధీనం చేసుకుని పరీశీలించగా నటిని బెదిరించిన ఇద్దరు వ్యక్తులు సూరజ్ పరదేశి(32) ప్రవీణ్ వాలీంబే(28)లను థానేలో అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిపై ఐపీసీ సెక్షన్306, 170, 388, 384, 506, 120 బీ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమెతో పాటు పార్టీలో పాల్గోన్నఆమె స్నేహితుల్లో ఒకరైన అసిర్‌కాజీ కి కూడా ఈ బ్లాక్ మెయిలింగ్‌లో ప్రమేయముందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : New E-cycles from Hero: దేశంలోనే మొట్టమొదటిసారిగా బ్లూటూత్ తో వచ్చిన సైకిల్

కాగా ఈ ఘటనపై మహారాష్ట్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి నవాబ్ మాలిక్ స్పందించారు. ప్రైవేట్ వ్యక్తులతో చేతులు కలిపి ఎన్సీబీ సెలబ్రిటీలను బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తోందని ఆరోపించారు. నటి ఆత్మహత్యకు పాల్పడటం చాలా బాధాకరమని ఆయన అన్నారు.  ఎన్సీబీ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా సెలబ్రిటీలను డబ్బులు డిమాండ్ చేస్తోందనే ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే కొందరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారని నవాబ్ మాలిక్ పేర్కోన్నారు.