Peddada Murthi : టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ పాటల రచయిత కన్నుమూత..

గత సంవత్సరం టాలీవుడ్ లో అనేక విషాదాలు ఏర్పడ్డాయి. పలువురు స్టార్లు, ప్రముఖులు కన్నుమూశారు. ఆ విషాదాల్లోంచి టాలీవుడ్ ఇంకా కోలుకోకముందే మరో స్టార్ గేయ రచయిత కన్నుమూశారు. ప్రముఖ పాటల రచయిత పెద్దాడ మూర్తి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో

Peddada Murthi : టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ పాటల రచయిత కన్నుమూత..

Famous lyric writer peddada murthy passes away

Updated On : January 4, 2023 / 7:24 AM IST

Peddada Murthi :  గత సంవత్సరం టాలీవుడ్ లో అనేక విషాదాలు ఏర్పడ్డాయి. పలువురు స్టార్లు, ప్రముఖులు కన్నుమూశారు. ఆ విషాదాల్లోంచి టాలీవుడ్ ఇంకా కోలుకోకముందే మరో స్టార్ గేయ రచయిత కన్నుమూశారు. ప్రముఖ పాటల రచయిత పెద్దాడ మూర్తి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మంగళవారం రాత్రి మరణించారు.

విశాఖకు చెందిన పెద్దాడ మూర్తి జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించి పలు వార్తా పత్రికలలో పనిచేసి అనంతర సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. కూతురు అనే ఓ సినిమాకి మొదట పాటని రాశారు. ఆ తర్వాత ఇడియట్, మధుమాసం, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, పౌరుడు, చందమామ, స్టాలిన్, కౌసల్య సుప్రజ రామ, బలాదూర్, శుభలేఖలు.. ఇలా అనేక సినిమాలకి పాటలు రాసి పాపులర్ అయ్యారు. నోటెడ్ కాని చాలా చిన్న సినిమాలకి కూడా పాటలు రాశారు. ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమాలు ఆయనకి బాగా పేరు తెచ్చిపెట్టాయి. కొన్ని సినిమాలకి అన్ని పాటలు రాయగా చాలా సినిమాల్లో ఒక్కొక్క పాట రాశారు. ఆయన కెరీర్ లో దాదాపు 200 కి పైగా పాటలు రాశారు.

Shruthi Haasan : చలిలో చీరతో డ్యాన్స్ చేయడం చాలా కష్టం.. కానీ తప్పలేదు..

గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో సినీ పరిశ్రమకి దూరంగా ఉంటున్నారు మూర్తి. ఆయన మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖులు ఆయనకి సంతాపం తెలియచేస్తున్నారు. 51 ఏళ్ళ వయసులో ఆయన కన్నుమూశారు. ఆయనకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బుధవారం నాడు హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ శ్మశానవాటికలో పెద్దాడ మూర్తి అంత్యక్రియల్ని నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.