Dil Raju : “ఫాంటమ్ డిజిటల్ ఎఫెక్ట్స్ లిమిటెడ్” స్టూడియో ప్రారంభించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు!!

భారతదేశంలోని ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోలలో ఒకటైన ఫాంటమ్ డిజిటల్ ఎఫెక్ట్స్ లిమిటెడ్, కంపెనీ తన స్టూడియోను హైదరాబాద్ లో స్టార్ట్ చేసింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు..

Dil Raju : “ఫాంటమ్ డిజిటల్ ఎఫెక్ట్స్ లిమిటెడ్” స్టూడియో ప్రారంభించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు!!

Famous Producer Dil Raju Launches Phantom FX Office in Hyderabad

Updated On : July 16, 2023 / 11:04 AM IST

Dil Raju : భారతదేశంలోని ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోలలో ఒకటైన ఫాంటమ్ డిజిటల్ ఎఫెక్ట్స్ లిమిటెడ్, కంపెనీ తన స్టూడియోను హైదరాబాద్ లో స్టార్ట్ చేసింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ స్టూడియో ప్రారంభించారు. దశాబ్ద కాలంగా Phantom FX తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ బహుళ భాషలలో చలనచిత్రాలు, టీవీ మరియు వాణిజ్య ప్రకటనల కోసం సృజనాత్మక VFX సేవలను అందిస్తుంది. దేశీయ మరియు అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లలో అధిక-నాణ్యత VFXని అందించడంలో ఫాంటమ్ కంపెనీ బలమైన ఖ్యాతిని కలిగి ఉంది.

Vishal : హ్యాట్రిక్ కొట్టేందుకు మరోసారి ఆ దర్శకుడితో విశాల్ సినిమా..

దిల్ రాజు మాట్లాడుతూ.. సినిమాల్లో మంచి వీఎఫ్‌ఎక్స్ క్వాలిటీగా ఉంటేనే ప్రేక్షకులు థ్రిల్‌ను అనుభవిస్తారు. ఫాంటమ్ లో మంచి టాలెంటెడ్ నిపుణులు వున్నారు.. నిర్మాతలందరూ ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలని కోరుకుంటూ.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

హైదరాబాద్ స్టూడియో బిజినెస్ హెడ్ సునీల్ ఆకుల మాట్లాడుతూ.. ఇరవై ఏళ్ల నుండి విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో వున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమలోని నిర్మాతలు, దర్శకులందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో హైదరాబాద్ లో ఫాంటమ్ యఫ్ఎక్స్ బ్రాంచ్ స్టార్ట్ చేయటం జరిగింది. పిలవగానే వచ్చి మా ఫాంటమ్ బ్రాంచ్ ఆఫీస్ ను ప్రారంభించిన దిల్ రాజు గారికి థాంక్స్ అన్నారు.

OG Movie : పవన్ లేకుండానే జరుగుతున్న OG షూటింగ్.. 50 డేస్..!

ఫాంటమ్‌ఎఫ్‌ఎక్స్ CEO మరియు వ్యవస్థాపకుడు, బెజాయ్ అర్పుతరాజ్ మాట్లాడుతూ.. నాణ్యమైన VFXని అందించడమే మా ఫాంటమ్ స్టూడియో యొక్క మొదటి ప్రాధాన్యత.. చెన్నై, ముంబై మరియు హైదరాబాద్‌లలో అత్యాధునిక స్టూడియోలతో, ఫాంటమ్‌ఎఫ్‌ఎక్స్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందుతోంది. ప్రపంచవ్యాప్తంగా భారతీయ విజువల్ ఎఫెక్ట్‌ల కోసం బార్‌ను పెంచుతోంది.. అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత టాగూర్ మధు, హోమ్ బలే సంస్థ ప్రతినిధి కైకాల రామారావు, హర్షిత్ రెడ్డి, దర్శకులు అశ్విన్ గంగరాజు, భరత్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.