Allu Arjun : అల్లు అర్జున్ కోసం ఏకంగా 1600 కి.మీ సైకిల్ తొక్కుకుంటూ..?
మనదేశంలో సినీతారలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Fan came from uttar pradesh by cycling 1600 kms to meet Allu Arjun
మనదేశంలో సినీతారలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమ అభిమాన నటీనటులను కలుసుకునేందుకు ఏమైనా చేయడానికి ఫ్యాన్స్ సిద్ధంగా ఉంటారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కలుసుకునేందుకు ఓ అభిమాని చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. బన్నిని కలుసుకునేందుకు ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్ నుంచి హైదరాబాద్ వరకు ఓ వ్యక్తి సైకిల్ పై వచ్చాడు.
1600 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన సదరు అభిమాని అల్లుఅర్జున్‌ను కలుసుకున్నాడు. బన్నీని చూడగానే ఎమోషనల్ అయ్యాడు. కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకునే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అల్లు అర్జున్ అతడికి ఓ పూల కుండీని బహుమతిగా ఇచ్చాడు. అంతేకాదండోయ్ తన మంచి మనసును చాటుకున్నాడు.
తాను ఏదైన ఫ్లైట్ బుక్ చేయిస్తానని, సైకిల్ పై వెళ్లవద్దని అభిమానితో అన్నాడు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చూడాలంటూ తన స్టాఫ్‌కు చెప్పాడు. ఇక అభిమాని తొక్కుకుంటూ వచ్చిన సైకిల్‌ను సైతం ఏదైన బస్సుకి బుక్ చేసి పంపే ప్రయత్నం చేయాలన్నాడు. దారి ఖర్చులకు కొంత డబ్బును సైతం ఇచ్చినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. పుష్ప ప్రమోషన్స్‌కి ఉత్తరప్రదేశ్ వస్తే అక్కడ అతడిని కలుస్తానని మాట కూడా ఇచ్చాడు.
A fan cycled over 1600 km from Aligarh, Uttar Pradesh, to Hyderabad to meet his hero, Icon Star #AlluArjun. Heartfelt scenes!! pic.twitter.com/mEfUwEQJmm
— Aakashavaani (@TheAakashavaani) October 16, 2024