Puneeth Rajkumar : పునీత్‌కు అభిమాని నివాళి.. వైరల్ అవుతున్న వీడియో..

పునీత్ రాజ్ కుమార్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. అభిమానులు నివాళులర్పిస్తున్నారు..

Puneeth Rajkumar : పునీత్‌కు అభిమాని నివాళి.. వైరల్ అవుతున్న వీడియో..

Puneeth

Updated On : October 30, 2021 / 6:10 PM IST

Puneeth Rajkumar : కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ షాక్‌కి గురైంది. సినీ నటుడిగానే కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ తెరవెనుక కూడా రియల్ హీరో అనిపించుకున్న పునీత్ ఇక లేరు అనే వార్తతో అభిమానులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

Kannada Power Star : పునీత్ రాజ్ కుమర్ హాఠాన్మరణం, గుండెపోటుతో అభిమాని మృతి

తమ అభిమాన నటుడు ఇక లేరు అనే వార్త వినగానే గుండెపోటుతో పునీత్ అభిమాని ఒకరు కన్నుమూశారు. మరి కొందరు ఆత్మహత్యా ప్రయత్నాలు చేశారు. పునీత్‌ను కడసారి చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు కంఠీరవ స్టేడియంకు చేరుకున్నారు. ఆదివారం (అక్టోబర్ 31) కంఠీరవ స్టూడియోలో తండ్రి రాజ్ కుమార్ సమాధి పక్కనే పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు జరుగనున్నాయి.

Puneeth Rajkumar : బాబాయ్ – అబ్బాయ్ భావోద్వేగం..

పునీత్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అప్పు అభిమానులు నివాళులర్పిస్తున్నారు. ఓ ఫ్యాన్ తన అభిమాన నటుడికి నివాళి అర్పించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అప్పు వుయ్ మిస్ యు అంటూ వివిధ రకాల రంగులతో పునీత్ రాజ్ కుమార్ చిత్రాన్ని గీసాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భావోద్వేగానికి గురవుతున్నారు పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్స్..