Mahesh Babu On Wedding Card: ఇది కదా అభిమానం అంటే.. ఏకంగా పెళ్లి పత్రిక మీద మహేష్ బాబు ఫొటో..

ఈ పెళ్లి కార్డుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Mahesh Babu On Wedding Card: హీరోలకు ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. వారిలో కొందరు వీరాభిమానులు ఉంటారు. తమ అభిమానం చాటుకునేందుకు ఈ వీరాభిమానులు చేసే పనులు ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు వీరాభిమాని ఒకరు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతడు మహేష్ బాబు పట్ట తనకున్న అభిమానాన్ని చాలా డిఫరెంట్ గా చూపించాడు. ఏకంగా తన పెళ్లి పత్రికపై మహేశ్ బాబు ఫొటో ప్రింట్ చేయించాడు.

Aslo Read: ప‌వ‌న్ OG సినిమా బిజినెస్ ఆ రేంజ్‌లో జ‌రుగుతుందా?

ఆ వీరాభిమాని పేరు సాయి చరణ్. కర్నూలు జిల్లా వాసి. మహేశ్ బాబు అంటే సాయి చరణ్ కు పిచ్చి అభిమానం. ఈ క్రమంలో మహేష్ పై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. ఇటీవల సాయి చరణ్ కి పెళ్లి కుదిరింది. దీన్ని తన అభిమానం చాటుకునేందుకు అతడు వాడుకున్నాడు. ఏకంగా తన పెళ్లి కార్డుపై తన అభిమాన హీరో ఫొటో ప్రింట్ చేయించాడు. అంతేకాదు పెళ్లి పత్రికలను పంచడం స్టార్ట్ కూడా చేసేశాడు. ఈ పెళ్లి కార్డుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదీ కదా అభిమానం అంటే అని డిస్కస్ చేసుకుంటున్నారు.