Shah Rukh Khan : 95 రోజులు షారుఖ్ ఇంటిదగ్గరే.. ఎట్టకేలకు అభిమాని ఎదురుచూపులు ఫలించాయి..

Fan waited for 95 days outside to meet Shah Rukh Khan

Shah Rukh Khan : బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ గురించి తెలిసిందే. ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ గా ఎదిగిన షారుఖ్ కి కేవలం బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. షారుఖ్ చేసిన సినిమాలు కేవలం హిందీలోనే కాకుండా తెలుగులో కూడా విడుదలవుతున్నాయి.

ఇదిలాఉంటే షారుఖ్ కి డై హార్ట్ ఫాన్స్ ఉన్నారు. అయితే ఓ ఫ్యాన్ షారుఖ్ ను కలవడం కోసం ఎంతో ఓపికకాగా షారుఖ్ నివాసం వద్ద ఏకంగా 95 రోజులు ఉన్నాడు. షారుఖ్ ను కలవడం కోసం, ఆయనతో ఫోటోలు దిగడం కోసం షారుఖ్ ఇంటి వద్దే ఉండడంతో ఈ విషయం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుంది.

Also Read : VD 14 : విజయ్ దేవరకొండ కోసం ‘ది మమ్మీ’ విలన్.. ఈ సారైనా ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..

తాజగా ఆ అభిమాని ఎదురుచూపులకి ముగింపు పలుకుతూ షారుఖ్ తన ఇంటి నుండి బయటికి వచ్చి ఆ అభిమానితో కాసేపు మాట్లాడి, షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏదేమైనా 95 రోజులు ఒక అభిమాన హీరో కోసం ఎదురుచూడడం, తమ నివాసం వద్దే ఉండడం అంటే అంత తేలికైన విషయం కాదు. మొత్తానికి షారుఖ్ ఆ అభిమాని కోసం వచ్చి మాట్లాడం చూసిన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.