Puneeth Rajkumar : వైరల్ అవుతున్న పునీత్ పిక్స్.. ఫ్యాన్స్ ఎమోషనల్..
పునీత్ రాజ్ కుమార్.. తల్లిదండ్రులు పార్వతమ్మ, రాజ్ కుమార్‌లతో కలిసి ఉన్న ఫొటోలు చూసి ఫ్యాన్స్, నెటిజన్స్ ఎమోషనల్ అవుతున్నారు..

Puneeth Rajkumar Family
Puneeth Rajkumar: రోజులు గడుస్తున్నా కన్నడ పవర్ స్టార్ మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు అభిమానులు.. కన్నడ ప్రజలు.. పలు భాషలకు చెందిన సినీ ప్రముఖులు బెంగుళూరు వెళ్లి పునీత్ సమాధిని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. ఆయన కుటంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.
Puneeth Rajkumar : పునీత్‌కి నివాళులు అర్పించిన సూర్య
పునీత్ అకాల మరణంతో శాండల్‌వుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఇక మీడియా, సోషల్ మీడియాలో పునీత్‌ను గురించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. పునీత్ చిన్ననాటి పిక్స్, ఫ్యామిలీ ఫొటోలు, వీడియోలు.. ముఖ్యంగా వర్కౌట్స్ చేస్తున్న వీడియోలు, సోషల్ సర్వీస్ గురించిన వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.

తల్లిదండ్రులు పార్వతమ్మ, రాజ్ కుమార్‌లతో కలిసి ఉన్న ఫొటోలు చూస్తూ ఫ్యాన్స్, నెటిజన్స్ ఎమోషనల్ అవుతున్నారు. ఎందరకో సాయం చెయ్యాలనుకున్నాడు.. సినిమాల పరంగా ఎంతో భవిష్యత్తు ఉంది.. అంత మంచి వ్యక్తిని 46 ఏళ్లకే తీసుకెళ్లిపోయాడు దేవుడికి జాలి లేదు అంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు చేస్తున్నారు.
Puneeth Rajkumar : పునీత్ కుటుంబం ఈ బాధ నుండి త్వరగా కోలుకోవాలి – రాజేంద్ర ప్రసాద్