Trisha : ‘థగ్ లైఫ్’ సినిమా త్రిష ఎందుకు చేసిందో? అలాంటి పాత్ర ఎలా ఒప్పుకుంది? నిరాశ వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్..

సెకండ్ ఇన్నింగ్స్ లో త్రిష దూసుకుపోతుండటంతో కమల్ - మణిరత్నం కాంబోలో త్రిష కూడా ఉందని తెలియడంతో ఈ పాత్రపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

Fans Disappointed on Trisha Krishnan Character in Kamal Haasan Maniratnam Thug Life Movie

Trisha : మణిరత్నం – కమల్ హాసన్ కాంబోలో వచ్చిన థగ్ లైఫ్ సినిమా నేడు రిలీజయింది. నాయకుడు తర్వాత ఈ ఇద్దరి కాంబో వస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా ఫ్యాన్స్ ని, ప్రేక్షకులను నిరుత్సాపరుస్తుంది. రొటీన్ గ్యాంగ్ స్టర్ కథ, కథనంతో పాటు బాగా సాగదీసిన ఎమోషనల్ డ్రామా సినిమాగా థగ్ లైఫ్ తెరకెక్కించారు. ఈ సినిమాలో త్రిష కూడా ఉంది.

సెకండ్ ఇన్నింగ్స్ లో త్రిష దూసుకుపోతుండటంతో కమల్ – మణిరత్నం కాంబోలో త్రిష కూడా ఉందని తెలియడంతో ఈ పాత్రపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. కానీ త్రిష పాత్ర థియేటర్స్ లో ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేస్తుంది. ట్రైలర్ లోనే కమల్ హాసన్ తో త్రిష రొమాన్స్ సీన్ ఒకటి పెట్టడంతో విమర్శలు వచ్చాయి.

Also Read : Thug Life : ‘థగ్ లైఫ్’ మూవీ రివ్యూ.. కమల్ హాసన్ – మణిరత్నం కాంబో మెప్పించిందా?

ఇక సినిమాలో త్రిషది ఒక వ్యాంప్ క్యారెక్టర్. ఒక వేశ్యగా, డ్యాన్సర్ గా ఉన్న త్రిషని కమల్ హాసన్ కి ఆల్రెడీ భార్య ఉన్నా తెచ్చుకొని ఇంకో ఇంట్లో ఉంచుతాడు. ఒకవేళ వేశ్య క్యారెక్టర్ అయినా గతంలో చాలా మంది వేశ్య పాత్రలు చేసి మెప్పించారు. కానీ ఇందులో కేవలం అప్పుడప్పుడు కమల్ హాసన్ తో రొమాన్స్ చేయడానికే అన్నట్టు త్రిష పాత్ర ఉంటుంది.

దానికి మించి కమల్ కొడుకు, తమ్ముడిగా చిన్నప్పట్నుంచి శింబుని పెంచుతాడు. అలాంటి పాత్ర అయిన శింబు త్రిష ని కోరుకుంటాడు. కమల్ హాసన్ లేనప్పుడు త్రిషను తన దగ్గరికి భయపెట్టి తెచ్చుకుంటాడు. ఒక రకంగా చెప్పాలంటే తండ్రి కొడుకు పాత్రలు ఒకే అమ్మాయితో అక్రమసంబంధం పెట్టుకున్నట్టు ఉంటుంది. ముందు నుంచి త్రిష సీన్స్ చూడటానికి ఇబ్బందిగానే ఉంటాయనిపించిందేమో డైరెక్టర్ కి చివర్లో తన చిన్నప్పుడు బాధలు అని, మగాళ్లు అంతా ఇంతే అని త్రిష పాత్రతో ఓ నాలుగు మాటలు చెప్పించి ఆ పాత్రని చంపేస్తారు.

Also See : Vishnupriyaa Bhimeneni : బాబోయ్.. బ్లాక్ డ్రెస్ లో విష్ణుప్రియ హాట్ పోజులు..

ఆ పాత్రని అలా రాసుకోవడం ఒక ఎత్తైతే అసలు ఆ పాత్ర లేకపోయినా సినిమా నడుస్తుంది. సినిమా కథకు, త్రిష పాత్రకు సంబంధమే లేదు. కథ మధ్యలో త్రిష పాత్రని అనవసరంగా ఇరికించినట్టు ఉంటుంది. మరి మొత్తానికి త్రిష పాత్రని మణిరత్నం ఎందుకు రాసుకున్నాడో ఈ పాత్రకు ఆమెనే ఎందుకు తీసుకున్నాడో మణిరత్నంకే తెలియాలి.

థగ్ లైఫ్ లో త్రిషని ఈ పాత్రలో చూసిన తర్వాత ఫ్యాన్స్ అసలు త్రిష ఎందుకు ఈ పాత్ర ఒప్పుకుంది? కథలో ఇంపార్టెన్స్ లేకపోయినా త్రిష ఎందుకు ఈ సినిమా చేసింది అని ప్రశ్నిస్తున్నారు. అయితే కేవలం మణిరత్నం, కమల్ హాసన్ సినిమా అనే త్రిష చేసి ఉంటుందని సరిపెట్టుకుంటున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి మంచి పాత్రలతో మెప్పిస్తున్న త్రిష థగ్ లైఫ్ లో మాత్రం అసలు ప్రాముఖ్యత లేని ఓ పాత్ర చేసి నిరుత్సాహపరిచిందనే ఫీల్ అవుతున్నారు సినిమా లవర్స్. ఇక సినిమా రిలీజ్ కి ముందు త్రిష షుగర్ బేబీ ఓ సాంగ్ లో తన అందాలతో అలరించింది. ఆ సాంగ్ సినిమాలో ఉండకపోవడం గమనార్హం.

Also Read : Thug Life : థ‌గ్ లైఫ్ ట్విట్ట‌ర్ రివ్యూ.. క‌మ‌ల్ హాస‌న్ హిట్ కొట్టాడా?