Buchi Babu Sana : మా నాన్న చనిపోయారు.. ఉప్పెనకు అలా అడిగారు.. రామ్ చరణ్ సినిమాకు అలా అడగాల్సిన అవసరం లేదు..

తాజాగా బుచ్చిబాబు సాన బాపు అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చాడు.

Fans Happy with Buchi Babu Sana Interesting Comments on Ram Charan RC 16 Movie

Buchi Babu Sana : బుచ్చిబాబు సాన ఒక్క సినిమాతోనే స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి వెళ్ళిపోయాడు. సుకుమార్ దగ్గర దాదాపు పదేళ్లు పైనే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేసి వైష్ణవ తేజ్, కృతి శెట్టిలను హీరో హీరోయిన్స్ గా పరిచయం చేస్తూ తెరకెక్కినచిన ఉప్పెన సినిమా భారీ హిట్ అయి 100 కోట్లు వసూలు చేసింది.

ఆ తర్వాత బుచ్చిబాబు సాన ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడు అన్నారు కానీ రామ్ చరణ్ తో ఓకే అయింది. రామ్ చరణ్ – జాన్వీ కపూర్ జంటగా బుచ్చి బాబు సాన దర్శకత్వంలో RC16 సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ షూటింగ్ అయిపోయింది. ఈ సినిమా పై మొదట్నుంచి ఏదో ఒక అప్డేట్ ఇస్తూ, మాట్లాడుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు బుచ్చిబాబు.

Also Read : Sukumar – Ram Charan : సుకుమార్ సినిమాలో చరణ్ అలా కనిపిస్తాడా? RC17 సినిమా వర్క్ మొదలుపెట్టిన సుక్కు..?

తాజాగా బుచ్చిబాబు సాన బాపు అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చాడు. ఈ ఈవెంట్లో సినిమా గురించి మాట్లాడిన తర్వాత వాళ్ళ నాన్న గురించి, రామ్ చరణ్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

బుచ్చిబాబు సాన మాట్లాడుతూ.. మా నాన్న కాలం చేసి సంవత్సరం అయింది. ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటూనే ఉండేవారు. నా మొదటి సినిమా ఉప్పెన రిలీజయిన సమయంలో రాజమండ్రిలో ఓ థియేటర్ కి సినిమా చూడటానికి వెళ్లారు. థియేటర్ బయటే సినిమా చూసి వచ్చే వాళ్ళందర్నీ సినిమా ఎలా ఉంది అని అడిగారు నా మొదటి సినిమాకి. ఆయన సినిమా సరిగ్గా చూడకుండా నేను తీసిన సినిమా ఎలా ఉందా అని అందర్నీ అడిగారు. ఇప్పుడు ఆయన లేరు. కానీ రామ్ చరణ్ సినిమాకు అలా అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది కచ్చితంగా హిట్ సినిమా అని అన్నారు.

Also Read : Find The Actress : బైక్ పై కూర్చున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా? అమెరికా వాడ్ని పెళ్లి చేసుకొని.. ఇప్పుడు ఇండియన్ టాప్ డైరెక్టర్ సినిమాలో హీరోయిన్..

దీంతో బుచ్చిబాబు వ్యాఖ్యలు వైరల్ అవ్వగా అతని కాన్ఫిడెంట్ చూసి చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న RC16 దసరాకు రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.