Find The Actress : బైక్ పై కూర్చున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా? అమెరికా వాడ్ని పెళ్లి చేసుకొని.. ఇప్పుడు ఇండియన్ టాప్ డైరెక్టర్ సినిమాలో హీరోయిన్..
ఇంతకీ ఈ బైక్ మీద కూర్చొని కళ్ళజోడు పెట్టుకున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా?

Do You Know This Child on Bike Present Star Heroine Working in Indian Top Director Movie
Find The Actress : తాజాగా ఓ స్టార్ హీరోయిన్ తన చిన్నప్పటి ఫొటోలన్నీ కలిపి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అప్పటి మెమరీస్ ని గుర్తుచేసుకుంది. ఇక సెలబ్రిటీలు చిన్నప్పటి ఫోటోలు షేర్ చేసారంటే అవి వైరల్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఈ స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ ఈ బైక్ మీద కూర్చొని కళ్ళజోడు పెట్టుకున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఇప్పుడు హాలీవుడ్ లో సెటిల్ అయిన హీరోయిన్ ప్రియాంక చోప్రా. మిస్ వరల్డ్ 2000 టైటిల్ గెలుచుకున్న ప్రియాంక చోప్రా 2002లో తమిళ సినిమా తమిజన్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. హాలీవుడ్ లో అవకాశాలు రావడంతో అక్కడికి వెళ్లి ఇప్పుడు హాలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తుంది.
Also Read : Khaidi 2 : కార్తీ కోసం రాబోతున్న నలుగురు హీరోలు.. ఖైదీ 2లో స్టార్ హీరోలు..
అమెరికాకు వెళ్లిన తర్వాత అమెరికన్ సింగర్ నిక్ జోనస్ తో పరిచయమై ప్రేమగా మారి పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయింది ప్రియాంక చోప్రా. ఈమెకు మాల్తీ అని ఒక పాప కూడా ఉంది. ప్రియాంక చోప్రా అమెరికాలో సెటిల్ అయ్యాక ఇండియాకు చాలా రేర్ గా వచ్చేది, ఇక్కడి సినిమాలు కూడా తగ్గించేసింది.
కానీ ఇటీవలే ఓ పాన్ ఇండియా సినిమాకు ఓకే చెప్పింది. ఇండియన్ టాప్ డైరెక్టర్ మన రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమాకి ప్రియాంక ఓకే చెప్పింది. RRR తర్వాత రాజమౌళి భారీ స్థాయిలో మహేష్ బాబుతో నిర్మిస్తున్న సినిమాలో ప్రియాంక చోప్రాని హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నారు. ఇండియానా జోన్స్ తరహాలో ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ప్రియాంక చోప్రాని తీసుకుంటే ఇండియన్ అమ్మాయిని తీసుకున్నట్టు ఉంటుంది, అలాగే హాలీవుడ్ లో కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు అని తీసుకున్నారు అని టాక్. ఇక ఈ సినిమాకి ప్రియాంక చోప్రా ఆల్మోస్ట్ 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం.