Khaidi 2 : కార్తీ కోసం రాబోతున్న నలుగురు హీరోలు.. ఖైదీ 2లో స్టార్ హీరోలు..

లోకేష్ కనగరాజ్ కూలి సినిమా అయ్యాక ఖైదీ 2 సినిమానే మొదలుపెడతాడని ఇటీవల కార్తీ తెలిపాడు.

Khaidi 2 : కార్తీ కోసం రాబోతున్న నలుగురు హీరోలు.. ఖైదీ 2లో స్టార్ హీరోలు..

Four Star Heros for Lokesh Kanagaraj Karthi Khaidi 2 Movie Rumors goes Viral

Updated On : February 19, 2025 / 9:15 AM IST

Khaidi 2 : తమిళ్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ సృష్టించి తన సినిమాలతో రాబోయే సినిమాలపై కూడా అంచనాలు నెలకొల్పాడు. తెలుగులో కూడా లోకేష్ కనగరాజ్ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ రజినీకాంత్ తో కూలి సినిమా చేస్తునాడు. ఈ సినిమాలో నాగార్జునతో పాటు పలువురు తమిళ్ స్టార్స్ కూడా కనపడనున్నారు.

Also Read : Jabardasth Ram Prasad : జబర్దస్త్ రామ్ ప్రసాద్ హీరోగా W/O అనిర్వేష్.. సెన్సార్ పూర్తి చేసుకొని..

లోకేష్ తీసిన ఖైదీ, విక్రమ్ సినిమాలకు సీక్వెల్స్ తీస్తాను అని ప్రకటించాడు. అలాగే విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్రతో కూడా ఓ సినిమా తీస్తాను అని ప్రకటించాడు. లోకేష్ దర్శకత్వంలో కార్తీ హీరోగా 2019 లో వచ్చిన ఖైదీ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఉండి వేరే సినిమాలకు లింక్ ఉండటంతో సీక్వెల్ కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

అయితే లోకేష్ కనగరాజ్ కూలి సినిమా అయ్యాక ఖైదీ 2 సినిమానే మొదలుపెడతాడని ఇటీవల కార్తీ తెలిపాడు. తాజాగా తమిళ మీడియాలో ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతుంది. ఖైదీ సినిమా కోసం నలుగురు హీరోలు రానున్నారు. ఖైదీ సినిమాకు విక్రమ్, రోలెక్స్ పాత్రలకు లింక్ పెట్టి కమల్ హాసన్, సూర్య, ఫహద్ ఫాసిల్ లుకూడా ఖైదీ 2 లో కనిపించేలా ప్లాన్ చేస్తున్నాడట లోకేష్. అలాగే తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ తో ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇప్పించాలని అనుకుంటున్నారట.

Also See : కన్నప్ప ‘శివ శివ..’ సాంగ్ మేకింగ్ వీడియో చూశారా? న్యూజిలాండ్ అడవుల్లో మంచు విష్ణు కష్టం..

ఇదే కనక నిజమయితే నలుగురు హీరోలు సినిమాలో ఉండటమే కాక ఇంకో స్టార్ హీరోతో వాయిస్ చెప్పించడంతో ఖైదీ 2 తమిళ్ లో భారీ సినిమాగా మారి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటుంది. మరి లోకేష్ ఖైదీ 2 ఎంత త్వరగా మొదలుపెడతాడో అని ఫ్యాన్స్ వెయిటింగ్.