Jabardasth Ram Prasad : జబర్దస్త్ రామ్ ప్రసాద్ హీరోగా W/O అనిర్వేష్.. సెన్సార్ పూర్తి చేసుకొని..

తాజాగా W/O అనిర్వేష్ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయింది.

Jabardasth Ram Prasad : జబర్దస్త్ రామ్ ప్రసాద్ హీరోగా W/O అనిర్వేష్.. సెన్సార్ పూర్తి చేసుకొని..

Jabardasth Ram Prasad Coming as Hero with W/O Anirvesh Movie

Updated On : February 19, 2025 / 7:24 AM IST

Jabardasth Ram Prasad : జబర్దస్త్ రామ్ ప్రసాద్, జెమినీ సురేష్, కిరీటి, సాయి ప్రసన్న, సాయి కిరణ్, నజియా ఖాన్, అద్వైత చౌదరి.. పలువురు ముఖ్య పాత్రలతో తెరకెక్కుతున్న సినిమా W/O అనిర్వేష్. గజేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేంద్ర గజేంద్ర సమర్పణలో వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాణంలో గంగ సప్తశిఖర దర్శకత్వంలో ఈ సినిమా నిర్మిస్తున్నారు.

Also See : Pawan Kalyan : మహా కుంభమేళాలో భార్య, కొడుకుతో పవన్ కళ్యాణ్.. పక్కనే త్రివిక్రమ్ కూడా.. ఫోటోలు చూశారా?

తాజాగా W/O అనిర్వేష్ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయింది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమాని ప్రశంసించారు. డైరెక్టర్ గంగ సప్తశిఖర కొత్త తరహా స్క్రీన్ ప్లే తో ఈ సినిమాని తెరకెక్కించారు. జబర్దస్త్ రాంప్రసాద్ హీరోగా ఒక కొత్త రకమైన క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ ఎంగేజింగ్ గా రానుంది.

Jabardasth Ram Prasad Coming as Hero with W/O Anirvesh Movie

త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు. W/O అనిర్వేష్ సినిమాని SKML మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర తెలంగాణలో రిలీజ్ చేయనున్నారు.