Puneeth Rajkumar : చెప్పులు విడిచి నివాళి… పునీత్ అభిమానుల ప్రేమకు సలాం..
పునీత్ రాజ్ కుమార్‌ను కడసారి చూసేందుకు పది లక్షల మందికి పైగా వచ్చారు..

Fans Pay Tribute To Puneeth Rajkumar
Puneeth Rajkumar: కన్నడ పవర్‌స్టార్, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ నటవారసుడు, కరునాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ తమ్ముడు, రియల్ లైఫ్ హీరో పునీత్ రాజ్ కుమార్ ఇకలేరు అనే మాట ఇంకా డైజెస్ట్ కావడం లేదు. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఇంకా షాక్‌లోనే ఉన్నారు.
గతకొద్ది రోజులుగా పునీత్‌కి సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఒక వార్తతో ఎమోషనల్ అవుతున్నారు. అభిమానుల సందర్శనార్ధం పునీత్ పార్థివ దేహాన్ని బెంగుళూరులోని కంఠీరవ స్టూడియోలో ఉంచిన సంగతి తెలిసిందే.
Puneeth Rajkumar : పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన అక్కినేని నాగార్జున
పది లక్షల మందికి పైగా పునీత్‌కి నివాళులర్పించారు. బెంగుళూరు మున్సిపాలిటీ వాళ్లు క్లీన్ చేస్తుంటే స్టేడియం బయట లక్షల కొద్దీ చెప్పులు ఉండడంతో ఆశ్చర్యపోయారు. పునీత్‌ను కడసారి చూసేందుకు ఇంతమంది వచ్చారంటూ ఎమోషనల్ అయ్యారు.
Puneeth Rajkumar : పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన రామ్ చరణ్
భౌతిక కాయాన్ని నివాళులు అర్పించేటప్పుడు చెప్పులు వేసుకోకపోవడం సాంప్రదాయం కాబట్టి అందరూ చెప్పులు కంఠీరవ స్టేడియం బయటే వదిలి వెళ్లారు. నివాళులర్పించిన తర్వాత అంతమందిలో ఎవరి చెప్పులు ఎవరు గుర్తుపడతారు అని వదిలేసి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్‌ని త్వరగా తీసుకెళ్లిపోవడానికి దేవుడికి మనసెలా ఒప్పిందంటూ ఎమోషనల్ అవుతున్నారందరూ.