Puneeth Rajkumar : పునీత్‌ కుటుంబాన్ని పరామర్శించిన అక్కినేని నాగార్జున

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అక్టోబర్ 29న గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే.. పునీత్ హఠాన్మరణంతో చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.

Puneeth Rajkumar : పునీత్‌ కుటుంబాన్ని పరామర్శించిన అక్కినేని నాగార్జున

Puneeth Rajkumar

Updated On : November 2, 2021 / 8:27 PM IST

Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అక్టోబర్ 29న గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే.. పునీత్ హఠాన్మరణంతో చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. పునీత్ కన్నుమూసి ఐదు రోజులు గడుస్తున్నా ఇప్పటికి ఆయన మృతిని అభిమానులు, నటీనటులు జీర్ణించుకోలేకపోతున్నారు.

చదవండి : Puneeth Rajkumar: పునీత్ చివరి చూపుకు నోచుకోని కోలీవుడ్.. కారణం ఏంటి?

కర్ణాటక సీఎం బొమ్మై పునీత్ పార్థివదేహాన్ని ముద్దాడి కన్నీరు పెట్టారు. కంఠీరవ స్టేడీయంలో ఆదివారం పునీత్‌ అంత్యక్రియలు ముగిశాయి. ఆయన అంత్యక్రియల్లో తెలుగు, మలయాళ, కన్నడ పరిశ్రమలకు చెందిన అగ్ర హీరోలంతా పాల్గొన్నారు.

పునీత్ మరణంపై రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇక అంత్యక్రియలకు వెళ్లలేకపోయిన హీరో అక్కినేని నాగార్జున మంగళవారం పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పునీత్‌ ఇంటికి వెళ్లిన ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.

Nagarjuna 1

Nagarjuna 1

చదవండి : Puneeth Rajkumar: ఈ బాధ ఎవరికీ రాకూడదు.. శివ రాజ్‌కుమార్‌ ఆవేదన!

అనంతరం పునీత్‌ సోదరుడు, హీరో శివరాజ్‌కుమార్‌తో పాటు ఆయన భార్య, పిల్లలను పరామర్శించారు. శివరాజ్‌తో కాసేపు మాట్లాడి ఓదార్చారు. కాగా ఆయన అంత్యక్రియలకు మెగాస్టార్‌ చిరంజీవి, బాలకృష్ణ వెంకటేశ్‌, శ్రీకాంత్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌తో పాటు పలువుకు తెలుగు హీరోలు హజరైన సంగతి తెలిసిందే.