Puneeth Rajkumar: పునీత్ చివరి చూపుకు నోచుకోని కోలీవుడ్.. కారణం ఏంటి?

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణం ఒక్క కన్నడ చిత్ర సీమనే కాదు యావత్‌ సినీ పరిశ్రమను విషాదంలో నెట్టింది. భారీ స్టార్ ఇమేజ్, అంతకు మించిన వ్యక్తిత్వం ఉన్న పునీత్ ఇంకా..

Puneeth Rajkumar: పునీత్ చివరి చూపుకు నోచుకోని కోలీవుడ్.. కారణం ఏంటి?

Puneeth Rajkumar (1)

Puneeth Rajkumar: కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణం ఒక్క కన్నడ చిత్ర సీమనే కాదు యావత్‌ సినీ పరిశ్రమను విషాదంలో నెట్టింది. భారీ స్టార్ ఇమేజ్, అంతకు మించిన వ్యక్తిత్వం ఉన్న పునీత్ ఇంకా ఎంతో భవిష్యత్తు చూడాల్సి ఉండగానే హఠాన్మరణం చెందడం అందరిని కలిచివేస్తుంది. ముఖ్యంగా పునీత్ కన్నడలో స్టార్ అయినా.. దక్షణాది అన్ని ఇండస్ట్రీల హీరోలు, నటీనటులతో సాన్నిహిత్యం ఉంది. అందుకే పునీత్ మరణంతో దక్షణాది అన్ని సినీ ఇండస్ట్రీలలో ఎంతోమంది ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.

Puneeth Rajkumar: ఈ బాధ ఎవరికీ రాకూడదు.. శివ రాజ్‌కుమార్‌ ఆవేదన!

టాలీవుడ్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, ఎన్టీఆర్, శ్రీకాంత్ ఇలా కొందరు కదిలి వెళ్లి తమ అనుబంధాన్ని గుర్తుచేసుకొని కన్నీరు పెట్టుకున్నారు. తెలుగుతో పోల్చుకుంటే పునీత్ కు తమిళ హీరోలతో మరింత దగ్గరి సంబంధాలున్నాయి. ముఖ్యంగా తమిళ హీరోలు విజయ్, సూర్య, విశాల్ లకు పునీత్ మంచి స్నేహితుడు కూడా. అయినా, తమిళ ఇండస్ట్రీ నుండి పునీత్ చివరి చూపు కోసం ఒక్కరూ కనిపించలేదు. పునీత్ అంతిమ సంస్కారాలు పూర్తయ్యాక సోమవారం నటుడు ప్రభు వెళ్లి పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు.

Puneeth-Pranitha: ప్రణీత ఉదారత.. పునీత్ నివాళిగా మెడికల్ క్యాంప్!

పునీత్ తండ్రి రాజ్ కుమార్, ప్రభు తండ్రి, లెజెండరీ నటుడు శివాజీ గణేశన్ మధ్య సంబంధాలుండగా.. ఇప్పటి తరంలో కూడా ఈ కుటుంబం మధ్య అనుబంధం ఉంది. అందుకే ప్రభు పునీత్ మరణించిన రోజు వెళ్లకపోయినా సోమవారం వెళ్లి పరామర్శించారు. అయితే.. మిగతా హీరోలెవరూ కూడా పునీత్ కోసం వెళ్ళలేదు. పునీత్ చదివించే 1800 పిల్లలని విశాల్ మరో ఏడాది పాటు చదివించేందుకు ముందుకొచ్చాడు.. కానీ చివరి చూపుకు అయితే వెళ్ళలేదు. కాగా, దీనికి ఓ రాజకీయ కారణం ఉన్నట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Puneeth Rajukumar: డబ్బింగ్ లేకుండానే పునీత్ చివరి సినిమా విడుదల!

చాలా సంవత్సరాలుగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరీ జల వివాదం నడుస్తుంది. గతంలో ఒకసారి ఈ వివాదంలో రెండు రాష్ట్రాల నటీనటులు ఆయా రాష్ట్రాల తరపున అండగా నిలిచారు. అప్పుడే తమిళ సినిమాలను కర్ణాటకలో విడుదల చేయకూడదని అప్పట్లో కన్నడ హీరోలు నినాదాలు కూడా చేశారు. దీంతో ఇలాంటి సమయంలో పునీత్‌ అంత్యక్రియలకు హాజరైతే రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదురువుతాయనే ఉద్దేశంతోనే కోలీవుడ్‌ హీరోలు హాజరు కాలేదని వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.