Allu Arjun : బన్నీకి ఫ్యాన్స్ అసోసియేషన్ సన్మానం.. ముఖ్య అతిధిగా చిరంజీవి..
తాజాగా 'పుష్ప' సినిమా భారీ విజయం సాధించినందుకు అల్లు అర్జున్ కి సన్మానం నిర్వహించారు. డాక్టర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి పార్క్ హయత్.........

Allu Arjun
Allu Arjun : గత సంవత్సరం చివర్లో వచ్చిన అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా ఎంత భారీ విజయం సాధించిందో తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ సినిమా, సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి కలెక్షన్లని రాబట్టింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. దేశ వ్యాప్తంగా అల్లు అర్జున్ కి క్రేజ్ పెరిగింది. తాజాగా ‘పుష్ప’ సినిమా భారీ విజయం సాధించినందుకు అల్లు అర్జున్ కి సన్మానం నిర్వహించారు.
Samantha : సమంత చేతిలో మరో కమర్షియల్ యాడ్..
డాక్టర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి పార్క్ హయత్ హోటల్లో ఘనంగా సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, కేంద్ర మాజీ మంత్రి టి సుబ్బిరామిరెడ్డి, పలువురు సినీ ప్రముఖులు వచ్చారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గడ్డం రవికుమార్ గజమాలతో సత్కరించారు.