Warner Bros Studios : పేలుడుతో వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్‌లో భారీ అగ్నిప్రమాదం..
హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం నాడు జరిగిన పేలడంతో..
![Warner Bros Studios : పేలుడుతో వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్‌లో భారీ అగ్నిప్రమాదం.. Warner Bros Studios : పేలుడుతో వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్‌లో భారీ అగ్నిప్రమాదం..](https://10tv.in/wp-content/uploads/2023/07/Fire-Brokes-at-Warner-Bros-Studios-due-to-transformer-explode.jpg)
Fire Brokes at Warner Bros Studios due to transformer explode
Warner Bros Studios : ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అమెరికా కాలిఫోర్నియా (California) లోని బర్బ్యాంక్ లో(Burbank) ఉన్న వార్నర్ బ్రదర్స్ స్టూడియోలో ఈ శుక్రవారం (జూన్ 30) నాడు ట్రాన్స్ ఫార్మర్ పేలడంతో అగ్ని చెలరిగినట్లు సమాచారం. పేలుడు జరిగిన కాసేపటిలోనే మంటలు భారీగా చెలరేగడంతో నల్ల పొగ స్టూడియో మొత్తని కమ్మేసింది. ఆ మంటల్లో కొంతమంది జనాలు కూడా చిక్కుకుపోయారు.
The Legend of Hanuman : ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 వచ్చేస్తుంది.. మొదటి రెండు బ్లాక్ బస్టర్..
అయితే ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఇక రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. ఏ ఒక్కరికి ప్రాణానికి హాని కలగకుండా కాపాడారు. ఎటువంటి ప్రాణనష్టం జరగపోవడంతో ప్రతిఒక్కరు హమ్మయ్య అనుకున్నారు. అలాగే ఈ యాక్సిడెంట్ గల పూర్తి కారణాలు తెలుసుకోడానికి అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ యాక్సిడెంట్ కి సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Mahesh Babu : నీ దూకుడు సాటెవ్వడు.. బాబోయ్ జిమ్‌లో మహేష్ వర్క్ అవుట్స్ చూశారా..
BREAKING!🚨 There is a HUGE fire reported at Warner Bros Studios in Los Angeles, CA. 🔥🔥🔥 pic.twitter.com/sDm1uoCKuJ
— The Patriot Voice (@TPV_John) June 30, 2023
కాగా ఇటీవల గ్లాడియేటర్ 2 (Gladiator 2) లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పారామౌంట్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దాదాపు 23 ఏళ్ల క్రిందట వచ్చిన సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా సెట్ లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి నిర్మాతలు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఇంతటి ప్రమాదం ఎప్పుడు చూడలేదని చెప్పుకొచ్చారు.