First Day First Show: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న ఫస్ట్ డే ఫస్ట్ షో!

టాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయిన చిత్రాల్లో ఫస్ట్ డే ఫస్ట్ షో అనే సినిమా కూడా ఉంది. ఈ సినిమాతో ‘జాతిరత్నాలు’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ అందించిన డైరెక్టర్ అనుదీప్ అసోసియేట్ అయ్యి ఉండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా రిలీజ్‌కు ముందర ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు అనుదీప్ బాగా కష్టపడ్డాడు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2న రిలీజ్ చేయగా, బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడంలో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.

First Day First Show Movie Locks OTT Release Date

First Day First Show: టాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయిన చిత్రాల్లో ఫస్ట్ డే ఫస్ట్ షో అనే సినిమా కూడా ఉంది. ఈ సినిమాతో ‘జాతిరత్నాలు’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ అందించిన డైరెక్టర్ అనుదీప్ అసోసియేట్ అయ్యి ఉండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా రిలీజ్‌కు ముందర ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు అనుదీప్ బాగా కష్టపడ్డాడు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2న రిలీజ్ చేయగా, బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడంలో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.

First Day First Show : ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ

అయితే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయినట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో స్ట్రీమింగ్ చేసేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన మూడు వారాల్లోనే ఓటీటీలో అందుబాటులోకి వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మరింత బజ్‌ను క్రియేట్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాలో ఓ యువకుడు తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు సొంతం చేసుకునేందుకు ఎలాంటి పాట్లు పడ్డాడు అనేది సినిమా కథగా మనకు చూపించనున్నారు.

Chiru: ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో అనుభ‌వాన్ని పంచుకున్న చిరు..వింటే నవ్వు ఆగదు

ఈ నేపథ్యంలో ఈ చిత్ర కథ నేటి యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక సినిమా థియేటర్లలో ఈ సినిమాను చూడని వారు ఓటీటలో ఖచ్చితంగా ఆదరిస్తారని మేకర్స్ భావిస్తున్నారు. కాగా ఈ సినిమాలో శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ సినిమాకు ఆహాలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో తెలియాలంటే సెప్టెంబర్ 23 వరకు వెయిట్ చేయాల్సిందే.