Chiru: ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభవాన్ని పంచుకున్న చిరు..వింటే నవ్వు ఆగదు
జాతిరత్నాలు సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అనుదీప్ కథని అందించిన సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో రిలీజ్ కి సిద్దమవ్వగా, బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. అయితే ఈ ఈవెంట్ లో యాంకర్ సుమ అడిగిన ఒక ప్రశ్నకి చిరు చెప్పిన సమాధానం విని స్టేజీ కింద ఉన్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు.

Chiru shares his First Day First Show Experience..
Chiru: జాతిరత్నాలు సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అనుదీప్ కథని అందిస్తూ కొత్త దర్శకుడు వంశీ, లక్ష్మి నారాయణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో రిలీజ్ కి సిద్దమవ్వగా, బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. గతంలో ఎన్నో క్లాసిక్ సినిమాలు నిర్మించిన పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ కొత్త నటీనటులతో ఈ సినిమాని నిర్మించారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు.
First Day First Show : ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
చిన్న సినిమాలని ఆదరించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందు ఉంటారు. ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ మంచి విజయాన్ని అందుకోవాలి అని కోరుకుంటూ ఇండస్ట్రీకి కొత్త దర్శకులు కొత్త యాక్టర్స్ వస్తుండాలి, అప్పుడే మంచి కథలు కూడా వస్తాయి అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ ఈవెంట్ లో యాంకర్ సుమ అడిగిన ఒక ప్రశ్నకి చిరు చెప్పిన సమాధానం విని స్టేజీ కింద ఉన్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు.
ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభవాన్ని పంచుకోవాలని అడిగిన సుమ ప్రశ్నకి చిరు బదులిస్తూ..”నేను ఇదివరకెప్పుడూ ఇది బయటకు చెప్పలేదు ఇవాళ చెబుతున్నా. నెల్లూరులో 8వ తరగతి చదువుతున్న సమయంలో ఏవీఎం నిర్మాణంలో ఎన్టీఆర్ నటించిన రాము సినిమాకి మా బంధువుల అబ్బాయి పూర్ణతో కలిసి నేను నాగబాబు వెళ్ళాం. అయితే నేల టికెట్ కోసం వరుసలోకి వెళ్లడంతో, ఆ తోపులాటలో నాగబాబుకి ఊపిరి ఆడలేదు. అదే సమయంలో మా నాన్నగారు అంతకుముందు షో చూసి బయటకు వస్తూ మమ్మల్ని చూశారు. ఇక అంతే నాగబాబుని ఆలా చుసిన నాన్న అక్కడే ఉన్న కొబ్బరిమట్టతో రోడ్ మీద కొట్టుకుంటూ మా ఇంటివరకు తీసుకువెళ్లారు” అని తన ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభవాన్ని పంచుకున్నారు.