హౌస్‌ఫుల్ 4 – ఫీమేల్ క్యారెక్టర్స్ ఫస్ట్‌లుక్స్

అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, రానా దగ్గుబాటి, కృతి సనన్, కృతి కర్బందా, పూజా హెగ్డే మెయిన్ లీడ్స్‌గా.. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్‌టైనర్.. 'హౌస్‌ఫుల్ 4'.. నుండి ఫీమేల్ క్యారెక్టర్స్ ఫస్ట్‌లుక్స్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : September 25, 2019 / 11:10 AM IST
హౌస్‌ఫుల్ 4 – ఫీమేల్ క్యారెక్టర్స్ ఫస్ట్‌లుక్స్

Updated On : September 25, 2019 / 11:10 AM IST

అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, రానా దగ్గుబాటి, కృతి సనన్, కృతి కర్బందా, పూజా హెగ్డే మెయిన్ లీడ్స్‌గా.. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్‌టైనర్.. ‘హౌస్‌ఫుల్ 4’.. నుండి ఫీమేల్ క్యారెక్టర్స్ ఫస్ట్‌లుక్స్ రిలీజ్..

అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, రానా దగ్గుబాటి, కృతి సనన్, కృతి కర్బందా, పూజా హెగ్డే మెయిన్ లీడ్స్‌గా.. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్‌టైనర్.. ‘హౌస్‌ఫుల్ 4’.. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సమర్పణలో, నడియాడ్ వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్నాడు. హౌస్‌ఫుల్ ఫ్రాంచైజీలో వస్తున్న నాలుగో సినిమా ఇది.

పునర్జన్మల నేపథ్యంలో 15వ శతాబ్దం నుండి 21వ శతాబ్దం వరకు అంటే.. దాదాపు 600 సంవత్సరాల వ్యవధిలో (1419 నుండి 2019 వరకు) ఈ కథ జరుగుతుందట. రీసెంట్‌గా అక్షయ్ కుమార్, బాబీ డియోల్, రితేష్ దేశ్‌ముఖ్ క్యారెక్టర్ల ఫస్ట్‌లుక్ పోస్టర్స్ రిలీజ్ చేసిన మూవీ టీమ్.. రీసెంట్‌గా కృతి సనన్, కృతి కర్బందా, పూజా హెగ్డే క్యారెక్టర్ల ఫస్ట్‌లుక్  పోస్టర్స్ కూడా విడుదల చేసింది.

Read Also :  రానా అతిథిపాత్రలో ‘తూటా’..

కృతి సనన్ ‘రాజకుమారి మధు’, ‘కృతి’గా కనిపించనుంది. కృతి కర్బందా.. ‘రాజకుమారి మీనా’, ‘నేహా’ పాత్రల్లో దర్శనమివ్వనుంది. పూజా హెగ్డే.. ‘రాజకుమారి మాల’, ‘పూజా’గా నటించింది. ఈ ఫస్ట్‌లుక్  పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. అమంద రోసారియో, చుంకీ పాండే, బొమన్ ఇరానీ, జానీ లివర్, పరేష్ రావెల్, రాజ్‌పాల్ యాదవ్, ప్రదీప్ రావత్, సౌరభ్ శుక్లా, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు నటించిన హౌస్‌ఫుల్ 4.. దివాళీకి రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 27న ట్రైలర్ విడుదల చెయ్యనున్నారు.