‘తుప్పరివాలన్-2’ : ఈ హీరోను గుర్తుపట్టారా?

విశాల్ నటిస్తూ, నిర్మాత, దర్శకుడిగా వ్యవహరిస్తున్న ‘తుప్పరివాలన్-2’ ఫస్ట్ లుక్..

  • Published By: sekhar ,Published On : March 11, 2020 / 12:50 PM IST
‘తుప్పరివాలన్-2’ : ఈ హీరోను గుర్తుపట్టారా?

Updated On : March 11, 2020 / 12:50 PM IST

విశాల్ నటిస్తూ, నిర్మాత, దర్శకుడిగా వ్యవహరిస్తున్న ‘తుప్పరివాలన్-2’ ఫస్ట్ లుక్..

తమిళ నటుడు విశాల్ కొత్త సినిమా ‘తుప్పరివాలన్-2’ (‘డిటెక్టివ్’‌కు సీక్వెల్).. ఫస్ట్ లుక్ బుధవారం సాయంత్రం రిలీజ్ చేసింది మూవీ టీమ్. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘మ్యాస్ట్రో’ ఇళయరాజా సంగీతమందిస్తున్నారు.

షూటింగ్ మధ్యలోనే డైరెక్టర్ మిస్కిన్ సినిమా  నుంచి తప్పుకున్నాడు. కొద్దిరోజులుగా విశాలే డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. ముందు అనుకున్న బడ్జెట్ కంటే రూ.5 కోట్లు ఎక్కువ అవసరమైందని, ఆ డబ్బును ఇవ్వడానికి హీరో, నిర్మాత విశాల్ నిరాకరించాడని, అందుకే సినిమా నుంచి తప్పుకున్నానని మిస్కిన్ వెల్లడించాడు. 

ఈ వివాదం గురించి తాజాగా విశాల్ ట్విటర్ ద్వారా స్పందించాడు. ‘తుప్పరివాలన్-2’తో తాను దర్శకుడిగా అరంగేట్రం చేయబోతున్నట్టు ప్రకటించాడు. ఆ వివాదం గురించి క్లారిటీ ఇస్తూ ఓ లేఖను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘ఎవరి వ్యక్తిగత ప్రతిష్టకో భంగం కలిగించాలనే ఉద్దేశం లేదు. కొంత మంది వ్యక్తుల విషయంలో నిర్మాతలు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పాలనేదే నా ఉద్దేశం’.. అంటూ  విశాల్ ట్వీట్ చేశాడు.

ప్రొడక్షన్‌లో, షూటింగ్ సమయంలో జరుగుతున్న తప్పులను ప్రశ్నించినందుకే దర్శకుడు అర్ధంతరంగా తప్పుకున్నట్టు విశాల్ వెల్లడించాడు. నిర్మాతగా తానెదుర్కొన్న పరిస్థితిని వేరెవరూ ఎదుర్కోకూడదని ఆకాంక్షించాడు. ఈ సినిమాకు తానే దర్శకత్వం వహించబోతున్నట్టు తెలిపాడు. ఈ సినిమాతో డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్నానని, అందరి అంచనాలను అందుకుంటానని తెలిపాడు. ఈ సినిమాకు హీరో, నిర్మాత, దర్శకుడిగా త్రిపాత్రాభినయం చేస్తున్నాడు విశాల్.