Tollywood Actress : తెలుగులో కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పుడు ఏం చేస్తుంది..

టాలీవుడ్ లో మొదటి సారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

Tollywood Actress : తెలుగులో కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పుడు ఏం చేస్తుంది..

First Tollywood Actress take one Crore Remuneration Details Here

Updated On : July 20, 2024 / 8:12 AM IST

Tollywood Actress : ఇప్పుడు హీరోలకు, హీరోయిన్స్ కి కోట్లల్లో రెమ్యునరేషన్స్ భారీగా ఇస్తున్నారు. హీరోయిన్స్ కి కూడా కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇప్పుడు కామన్ అయిపోయింది. బాలీవుడ్ లో అయితే 10 కోట్ల వరకు కూడా హీరోయిన్స్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మొదటిసారి కోటి రూపాయలు తీసుకున్న హీరోయిన్ శ్రీదేవి. అది ఓ బాలీవుడ్ సినిమా నుంచి అందుకుంది.

కానీ టాలీవుడ్ లో మొదటి సారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా? ఇంకెవరో కాదు పోకిరి భామ ఇలియానా. దేవదాసు సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా రెండో సినిమానే మహేష్ బాబు సరసన పోకిరి చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అప్పట్లో జీరో సైజు ఇలియానా వల్లే పాపులర్ అయింది. పోకిరి హిట్ తో అందరూ ఇలియానానే హీరోయిన్ గా తమ సినిమాల్లో కావాలని ట్రై చేశారు.

Also Read : Samantha : సంవత్సరం తర్వాత షూటింగ్‌ మొదలుపెట్టబోతున్న సమంత.. ఆ సినిమా కోసం అవన్నీ నేర్చుకుంటూ..

పోకిరి సినిమా పెద్ద హిట్ తర్వాత, ముంబై భామ కూడా కావడంతో తన నెక్స్ట్ సినిమా ఖతర్నాక్ కి తెలుగులో కోటి రూపాయలు తీసుకున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. రవితేజ సరసన ఖతర్నాక్ సినిమాలో ఇలియానా నటించింది. ఈ సినిమాకి ఇలియానా కోటి రూపాయలు తీసుకుందని సమాచారం. అప్పట్లో ఒక హీరోయిన్ కి కోటి రూపాయలు రెమ్యునరేషన్ ఇవ్వడం అదే మొదటిసారి. దీంతో ఇలియానా, ఖతర్నాక్ సినిమా అప్పట్లో చర్చగా మారింది. కానీ ఖతర్నాక్ సినిమా భారీ పరాజయం పాలైంది. ఆ తర్వాత తన రెమ్యునరేషన్ 1.25 కోట్ల వరకు కూడా పెంచింది. అయితే కొన్ని ఫ్లాప్స్ పడటంతో మళ్ళీ రెమ్యునరేషన్ తగ్గించిన ఇలియానా బాలీవుడ్ వెళ్ళాక కొన్ని సినిమాలు చేసినా కలిసి రాకపోవడంతో ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంటూ అడపాదడపా సినిమాల్లో కనిపిస్తుంది.

View this post on Instagram

A post shared by Ileana D'Cruz (@ileana_official)

ప్రస్తుతం ఇలియానా సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవలే ఓ బాబుకి జన్మనిచ్చిన ఇలియానా ప్రస్తుతం విదేశాల్లో తన బాబు, తన పార్ట్నర్ తో కలిసి ఉంటుంది. సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు పోస్ట్ చేస్తుంది.