Samantha : సంవత్సరం తర్వాత షూటింగ్‌ మొదలుపెట్టబోతున్న సమంత.. ఆ సినిమా కోసం అవన్నీ నేర్చుకుంటూ..

సమంత మళ్ళీ సినిమాలతో రాబోతుంది.

Samantha : సంవత్సరం తర్వాత షూటింగ్‌ మొదలుపెట్టబోతున్న సమంత.. ఆ సినిమా కోసం అవన్నీ నేర్చుకుంటూ..

Samantha starting Movie Shooting Soon Learning New Action Skills for her Next Movie

Updated On : July 20, 2024 / 7:58 AM IST

Samantha : సమంత గత సంవత్సరం ఖుషి సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత మాయోసైటిస్ తో బాధపడుతున్నాను సినిమాలకు కొంచెం గ్యాప్ ఇస్తాను అని చెప్పిన సంగతి తెలిసిందే. గత సంవత్సర కాలంలో తన మాయోసైటిస్ పోవడానికి, ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండటానికి అన్ని రకాల చికిత్సలు తీసుకుంటుంది. సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంది సమంత.

సమంత మళ్ళీ సినిమాలతో రాబోతుంది. ఆల్రెడీ షూట్ అయిపోయిన సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలో రిలీజ్ కాబోతుంది. అలాగే ఇటీవలే సమంత తన సొంత నిర్మాణ సంస్థలో మా ఇంటి బంగారం అనే సినిమాని ప్రకటించింది. తాజాగా సమంత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మళ్ళీ మొదలుపెట్టబోతున్న తన సినిమా జర్నీ గురించి చెప్పింది.

Also Read : Mega – Allu Family : మెగా – అల్లు ఫ్యామిలీలు అంతా ఒక్కటే.. ఇవన్నీ తాత్కాలికం.. రూమర్లపై స్పందించిన నిర్మాత..

సమంత తన సినిమాల గురించి మాట్లాడుతూ.. వచ్చే నెల నుంచే నా కొత్త సినిమా షూటింగ్ మొదలవుతుంది. ఆ షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నాను. ఆ సినిమాలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ప్రస్తుతం ఆ పాత్ర కోసం మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ, గుర్రపు స్వారీ, కత్తిసాము.. లాంటి వాటిల్లో శిక్షణ తీసుకుంటున్నాను. తెలియని చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను అని తెలిపింది.

దీంతో మా ఇంటి బంగారం సినిమా కోసం సమంత బాగానే కష్టపడుతుందని, ఆ సినిమా షూటింగ్ ఆగస్టు నుంచి మొదలవ్వబోతుందని తెలుస్తుంది. గత సంవత్సరం జులైలో ఖుషి షూటింగ్ ముగిశాక సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత మళ్ళీ సంవత్సరం తర్వాత ఇప్పుడు షూటింగ్స్ మొదలుపెట్టనుంది.