FNCC Members and film personalities meet and appreciated Venkaiah Naidu for selecting Padma Vibhushan Awards
Venkaiah Naidu : ఇటీవల పద్మ అవార్డులు(Padma Awards) కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. మన తెలుగువారు కూడా పలువురు పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు. ఇక మన మెగాస్టార్ చిరంజీవికి, భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడుకు కూడా పద్మ విభూషణ్ ని ప్రకటించారు. దీంతో నిన్నటినుంచి వీరిద్దరికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు స్వయంగా కలిసి వీరికి అభినందనలు తెలుపుతున్నారు.
వెంకయ్య నాయుడుకు నిన్న రాత్రి చిరంజీవి(Chiranjeevi) ప్రత్యేకంగా కలిసి అభినందించారు. ఇద్దరికీ పద్మ విభూషణ్ వచ్చినందుకు ఒకరికొకరు సత్కారం చేసుకున్నారు. అనంతరం పలువురు సినీ ప్రముఖులు వెంకయ్య నాయుడును కలిసి పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికైనందుకు ఆయనను సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో FNCC ప్రెసిడెంట్ నిర్మాత జి. ఆదిశేషగిరిరావు, వైస్ ప్రెసిడెంట్ టి. రంగారావు, సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, జాయింట్ సెక్రెటరీ వి.వి.ఎస్.ఎస్. పెద్దిరాజు, ట్రెజరర్ బి.రాజశేఖర్ రెడ్డి మరియు కమిటీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, జే.బాలరాజు, ఏ. గోపాలరావు గార్లు పాల్గొన్నారు.
Also Read : Raviteja : ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ‘రవితేజ’తో సినిమా.. ‘హనుమాన్’లో కోతి పాత్రతో..
FNCC (ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్) మెంబర్స్ అంతా పద్మ విభూషణ్ వరుకు ఎంపికైనందుకు వెంకయ్యనాయుడుకు అభినందనలు తెలియచేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. FNCC ప్రెసిడెంట్, నిర్మాత జి.ఆదిశేషగిరిరావు, సెక్రటరీ మోహన్ ముళ్ళపూడి మాట్లాడుతూ.. గతంలో వెంకయ్య నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గా, ఎంపీగా, వివిధ శాఖల మంత్రి గా, మాజీ ఉపరాష్ట్రపతి గా రాష్ట్రానికి, దేశానికి ఎన్నో సేవలు అందించారు. ఆయన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకుంటారు. అలాంటి ఉన్నత వ్యక్తికి పద్మ విభూషణ్ అవార్డు రావడం ఆనందంగా ఉంది. తెలుగువారిగా ఉపరాష్ట్రపతి స్థానానికి ఎదిగిన వ్యక్తి. తెలుగు సంప్రదాయ కార్యక్రమాలాకు హాజరవుతూ ప్రోత్సహించడంలో ముందుంటారు అని అన్నారు. అలాంటి వ్యక్తికి భారత రత్న కూడా రావాలని కోరుకున్నారు.