Funny Conversation between OG producers Pawan Kalyan fans
Pawan Kalyan OG : సుజిత్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న గ్యాంగ్ స్టార్ మూవీ ‘OG’. డివివి దానయ్య నిర్మిస్తున్న పవన్ కళ్యాణ్ నుంచి ఇలాంటి ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ వచ్చి చాలా ఏళ్ళు అవుతుంది. దీంతో ఈ సినిమా పై పవన్ అభిమానుల్లో మాత్రమే కాదు టాలీవుడ్ లోని ప్రతి ఒక్కరికి ఎంతో ఆసక్తి నెలకుంది. ఇటీవల ఈ మూవీ గ్లింప్స్ ని రిలీజ్ చేయగా.. దానిలో పవన్ పవర్ స్ట్రోమ్ చూసి ప్రతి ఒక్కరికి గూస్‌బంప్స్ వచ్చాయి. దీంతో ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా..? అనే ఆసక్తి మరింత రెట్టింపు అయ్యింది.
ఇక పవన్ అభిమానులు అయితే.. ఏ పండుగ వచ్చినా, స్పెషల్ డే వచ్చినా చిత్ర నిర్మాతలను అప్డేట్ ఇవ్వాలంటూ సోషల్ మీడియా వేదిక రిక్వెస్ట్ లు పెడుతున్నారు. ఇక ఫ్యాన్స్ చేసే పోస్టులకు నిర్మాతలు కూడా రియాక్ట్ అవుతూ ఫన్నీ రిప్లైలు ఇస్తూ వాళ్ళని ఒక ఆడుకుంటున్నారు. తాజాగా ఒక అభిమాని ట్విట్టర్‌లో.. ‘OG నుంచి పవన్‌ది ఒక కొత్త స్టిల్ రిలీజ్ చేయొచ్చుగా’ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి నిర్మాతలు రిప్లై ఇస్తూ.. “ఇదొకటి ఉంది. బొంబాయి షెడ్యూల్ పిక్” అంటూ పవన్ ఫోటో ఒకటి షేర్ చేశారు.
Also read : Dunki : వెనక్కి తగ్గడం కాదు.. సలార్ కంటే ముందే డంకీ..
ఆ ఫోటోకి అభిమాని బదులిస్తూ.. ‘క్లారిటీ లేదు’ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి నిర్మాతలు సమాధానం ఇస్తూ.. “హై క్వాలిటీ పిక్ లేదు. వాట్సాప్ క్వాలిటీదే ఉంది. ఇంకోరోజు హై క్వాలిటీది ఇస్తాలే” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని కొందరు మీమర్స్.. నెట్టింట పోస్టు చేస్తూ మరింత వైరల్ చేస్తున్నారు. కాగా ఈ మూవీ షూటింగ్ విషయానికి వస్తే.. ఆల్మోస్ట్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తుంది. పవన్ ఇంకో ఒకటి రెండు షెడ్యూల్స్ లో పాల్గొంటే పూర్తి అవుతుందని సమాచారం.