Gaddar Awards : గద్దర్ అవార్డులు ఇచ్చేది ఆ రోజే.. త్వరలో సీఎం చేతుల మీదుగా గద్దర్ అవార్డుల లోగో ఆవిష్కరణ..

నేడు గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డుల మీడియా సమావేశం జరిగింది.

Gaddar Telangana Film Awards Date Announced by Dil Raju

Gaddar Awards : నేడు గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డుల మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, FDC ఛైర్మన్ దిల్ రాజు, జ్యూరీ ఛైర్మన్ జయసుధ.. పలువురు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ.. జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానం జరగనుంది. హైదరాబాద్ లోని HICC లో అవార్డుల వేడుక జరగనుంది అని తెలిపారు.

Also Read : Theaters : టాలీవుడ్ కి షాక్.. మళ్ళీ మూత పడనున్న థియేటర్స్.. అల్టిమేటం జారీ చేసిన ఎగ్జిబిటర్లు..

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఏర్పాటు చేసుకున్న అవార్డులు. దశాబ్దకాలంగా సినీ పరిశ్రమ ఎలాంటి ప్రొత్సహకాలకు, అవార్డులకు నోచుకోలేదు. దశాబ్దకాలంగా నిర్లక్ష్యంగా చేయడం మంచి సంప్రదాయం కాదని సీఎం భావించారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు ప్రవేశపెట్టడానికి చాలా కారణాలున్నాయి. తన గళంతో తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారు. గద్దర్ పుట్టడం తెలంగాణ రాష్ట్ర అదృష్టం. తన పాటతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారు. అలాంటి వ్యక్తి పేరు మీద అవార్డులు ఇవ్వడం సముచిత నిర్ణయం. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల పట్ల ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉంది. ప్రతివారు ఈ అవార్డుల గురించి మాట్లాడుకునేలా వేడుకలు చేస్తాం. చలన చిత్ర అవార్డులతోపాటు వ్యక్తిగత అవార్డులను కూడా పొందుపర్చాం అని తెలిపారు.

సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. గద్దర్ పేరుతో ఇచ్చే అవార్డులపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన పేరుతో అవార్డులు ఇస్తాం అని తెలిపారు. అనంతరం గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు వచ్చిన ఎంట్రీలను జ్యూరీ ఛైర్మన్ జయసుధకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, FDC ఛైర్మన్ దిల్ రాజు అందచేశారు. త్వరలోనే సీఎం చేతుల మీదుగా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల లోగో ఆవిష్కరణ చేయనున్నారు.

Also Read : Mad Square : ఓటీటీలోకి మ్యాడ్ స్క్వేర్.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే..?