సనా షేకాడించిందిగా!

సీనియర్ నటి సనా స్పెషల్ అట్రాక్షన్‌గా ‘నిరీక్షణ’ చిత్రంలో వీడియో సాంగ్..

  • Published By: sekhar ,Published On : February 21, 2020 / 02:27 PM IST
సనా షేకాడించిందిగా!

Updated On : February 21, 2020 / 2:27 PM IST

సీనియర్ నటి సనా స్పెషల్ అట్రాక్షన్‌గా ‘నిరీక్షణ’ చిత్రంలో వీడియో సాంగ్..

సాయి రోనక్, ఇనా సాహా, ఆర్‌బి రమేష్ చౌదరి (ప్రముఖ నిర్మాత ఆర్‌బి చౌదరి పెద్ద కొడుకు, ‘రంగం’ ఫేమ్ జీవా అన్నయ్య) ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘నిరీక్షణ’.. పి. రంజన్ నిర్మాణంలో వంశీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతుందీ చిత్రం.

బ్రహ్మజీ, శ్రద్దాదాస్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. మహా శివరాత్రి సందర్భంగా ‘గల్లు గల్లు’ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ పాటలో సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సనా కూడా కనిపించింది. ఇద్దరు అమ్మాయిలతో, డ్యాన్సర్లతో పోటీపడుతూ సనా వేసిన స్టెప్స్ ఈ పాటకే హైలెట్.

ఇక ఆమె హావభావాల సంగతి చెప్పనవసరం లేదు. ‘మంత్ర’ ఆనంద్ ట్యూన్ కంపోజ్ చేయగా చంద్రబోస్ లిరిక్స్ రాశారు. శ్రావణ భార్గవి, ‘మంత్ర’ ఆనంద్ పాడారు. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌ని ఓ ఊపు ఊపుతోంది. మీరూ లుక్కెయ్యండి మరి.