Gangster Gangaraju : తెలుగు, తమిళ్ లో గ్యాంగ్‌స్టర్ గంగరాజు వచ్చేస్తున్నాడు..

 'వలయం' సినిమాతో మెప్పించి హీరో లక్ష్ ప్రస్తుతం 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' సినిమాతో రానున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తికాగా...............

Gangster Gangaraju : తెలుగు, తమిళ్ లో గ్యాంగ్‌స్టర్ గంగరాజు వచ్చేస్తున్నాడు..

Gangster

Updated On : May 10, 2022 / 10:54 AM IST

Gangster Gangaraju :  ‘వలయం’ సినిమాతో మెప్పించి రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా వైవిద్యభరితమైన కథలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నాడు హీరో లక్ష్. విలక్షణ కథలకు కమర్షియల్ టచ్ యాడ్ చేస్తూ రాసిన కథల్లో ఎనర్జిటిక్ పర్‌ఫార్‌మెన్స్‌తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ సినిమాతో రానున్నారు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా క‌ణ్ణ పీ.సీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తికాగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

Mahesh Babu : నాన్నగారి బయోపిక్ నేను చేయను

ఇందులో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. లిరికల్ సాంగ్స్, టీజర్ రిలీజ్ అవ్వడంతో సినిమాపై మంచి హైప్ నెలకొంది. పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు చివరిదశకు చేరుకున్నాయి. జూన్ 24న ఈ గ్యాంగ్‌స్టర్ గంగరాజు చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో చాలా ఘనంగా విడుదల చేయనున్నారు. ఫుల్ మాస్ మరియు కమర్షియల్ అంశాలతో ఈ సినిమా తెరకెక్కించామని, మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ తెలిపారు.