Mahesh Babu : నాన్నగారి బయోపిక్ నేను చేయను

ఈ ఈవెంట్ లో ఈ సినిమాతో పాటు మరి కొన్ని విషయాలు కూడా షేర్ చేసుకున్నారు మహేష్. విలేఖరులు అడిగిన పలు ప్రశ్నలకి...............

Mahesh Babu : నాన్నగారి బయోపిక్ నేను చేయను

Krishna

 

Mahesh Babu :  యువ హీరో అడివి శేష్ నటించిన పాన్ ఇండియా సినిమా ‘మేజర్’. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 26/11 అటాక్స్ లో పోరాడి వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ని అభిమానుల సమక్షంలో సూపర్ స్టార్ మహేష్ బాబు గ్రాండ్ గా విడుదల చేశారు. ఏఎంబీ సినిమాస్ లో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించారు.

 

ఈ ఈవెంట్ లో ఈ సినిమాతో పాటు మరి కొన్ని విషయాలు కూడా షేర్ చేసుకున్నారు మహేష్. విలేఖరులు అడిగిన పలు ప్రశ్నలకి సమాధానమిచ్చారు. ఈ సినిమా మీరు ఎందుకు చేయలేదు అని అడగగా.. కొన్ని కథలు కొందరికే సెట్‌ అవుతాయి. నాకు ఇలాంటి కథలు సెట్ అవ్వవు. వాటికి తగిన న్యాయం చేసేవారే ఈ కథని చేయాలి. ఇలాంటి కథలని ఎవరైనా తీస్తే చూసి ఆనందిస్తాను కానీ మనం చేస్తే బాగుండని ఆలోచించేంత సెల్ఫిష్‌ అయితే కాదు నేను. నా సినిమాలు నేనే చేయాలి, మిగిలిన వాటిని చూసి ఎంజాయ్‌ చేయాలి అని ఫీల్ అవుతాను అని తెలిపారు మహేష్.

Namita : ప్రెగ్నెంట్ అయిన బొద్దుగుమ్మ.. బయట పెట్టిన బేబీబంప్ ఫోటోలు..

ఇక కృష్ణ గారి బయోపిక్ గురించి అడగగా.. నాన్నగారి బయోపిక్ లో నేను నటించను. నాన్నగారి బయోపిక్‌ ఎవరైనా తీస్తే చాలా ఆనందంగా చూస్తాను. నేనైతే ఆ పాత్ర చేయలేను, ఎందుకంటే ఆయన నాకు దేవుడితో సమానం. ఎవరైనా తీస్తాను అంటే అవసరమైతే ప్రొడ్యూస్ చేస్తాను అని తెలిపారు.