Namita : ప్రెగ్నెంట్ అయిన బొద్దుగుమ్మ.. బయట పెట్టిన బేబీబంప్ ఫోటోలు..

తాజాగా మే 10న నమిత పుట్టిన రోజున తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తెలిపింది నమిత. సోషల్ మీడియాలో తన బేబీబంప్ ఫోటోలు షేర్ చేసి..............

Namita : ప్రెగ్నెంట్ అయిన బొద్దుగుమ్మ.. బయట పెట్టిన బేబీబంప్ ఫోటోలు..

Namita

Namita :  ఇటీవల హీరోయిన్స్ ప్రేంగ్నెంట్ అయిన విషయాన్ని ఓపెన్ గా సోషల్ మీడియాలో చెప్తూ అందరికి సర్‌ప్రయిజ్ ఇస్తున్నారు. అమ్మతనాన్ని ఎంజాయ్ చేయబోతున్నాం అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల నుంచి వరుసగా చాలా మంది హీరోయిన్స్ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేయడం, వారి పిల్లల ఫోటోలని పోస్ట్ చేయడం జరుగుతున్నాయి. ఇటీవలే కాజల్ ఓ బాబుకి జన్మనిచ్చింది. హీరోయిన్స్ ప్రణీత, సంజన గల్రాని ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేశారు. తాజాగా సింహమంటి చిన్నోడే అంటూ ఆడి పాడిన బొద్దుగుమ్మ నమిత ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసింది.

నమిత వర్ధమాన నటుడు వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మే 10న నమిత పుట్టిన రోజున తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తెలిపింది నమిత. సోషల్ మీడియాలో తన బేబీబంప్ ఫోటోలు షేర్ చేసి అభిమానులని ఆశ్చర్యపరిచింది. తల్లిని కాబోతున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను అని తెలిపింది.

Vishwak Sen : మరోసారి వార్తల్లో విశ్వక్‌సేన్.. వాటిని డిలీట్ చేయండి అంటూ హంగామా..

తన బేబీ బంప్ ఫోటోలని షేర్ చేసి.. ”నా లైఫ్ లో కొత్త అధ్యాయం మొదలైంది. కొత్త జీవితం, కొత్త మనుషులు నన్ను పిలుస్తున్నాయి. నేను ఇన్నాళ్లు కోరుకున్నది నీ గురించే, నీ కోసం ప్రార్థించాను. నువ్వు కడుపులో తంతుంటే, ఆడుకుంటుంటే నేను వాటిని ఆస్వాదిస్తాను. నువ్వు నన్ను కొత్తగా తయారు చేస్తున్నావు, కానీ నీ కోసం మరింత కొత్తగా తయారవుతున్నాను” అంటూ ఎమోషనల్ గా తనకి పుట్టబోయే బిడ్డ గురించి పోస్ట్ చేసింది నమిత.