Gautam Shares Photos With Friends From America
Gautam Ghattamaneni – Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన కొడుకు గౌతమ్, కూతురు సితారలు బాగా పాపులర్. సితార సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అయితే.. గౌతమ్ మాత్రం అప్పుడప్పుడూ పోస్టులు చేస్తూ ఉంటాడు.
ఇదిలా ఉంటే.. గౌతమ్ ఘట్టమనేని ప్రస్తుతం న్యూయార్క్‌లో చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో తన కాలేజీ లైఫ్ గురించి తెలియజేస్తూ తన ఫ్రెండ్స్‌తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో స్నేహితులతో కలిసి తిరగడం నుండి రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించడం వరకు గౌతమ్‌కు అన్నింటిని పోస్ట్ చేశాడు. దీనికి “డిడ్డీ యూనివర్సిటీ పార్ట్ 2” అనే క్యాప్షన్ ఇచ్చాడు.
Ram Charan : బుచ్చిబాబు దర్శకత్వంలో మూవీ.. రామ్ చరణ్ లుక్ చూశారా?
గౌతమ్ న్యూయార్క్ యూనివర్సిటీలో నాలుగేళ్ల డ్రామా కోర్స్ చేస్తున్నాడు. యాక్టింగ్, సినిమాకు సంబంధించిన పలు క్రాఫ్ట్స్ గురించి ఈ కోర్స్ ఉంటుంది. గౌతమ్ పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. దీనిపై పలువురు కామెంట్లు చేస్తున్నారు. కోర్స్ త్వరగా కంప్లీట్ చేయాలని కోరుతున్నారు. హీరోగా ఎంట్రీ ఎప్పుడు ఇస్తావని అడుగుతున్నారు.