Ram Charan : బుచ్చిబాబు దర్శకత్వంలో మూవీ.. రామ్ చరణ్ లుక్ చూశారా?
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్.. గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసేశారు.

RamCharan gearing up for a new look for the much anticipated RC16
Ram Charan – RC16 : గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్.. గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసేశారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. ఈ చిత్ర రిలీజ్‌కు ముందే చరణ్ తన నెక్ట్స్ మూవీని మొదలుపెట్టేందుకు సిద్ధం అవుతున్నాడు.
ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ మూవీలో చరణ్ నటించనున్నాడు. రామ్‌చరణ్ కెరీర్‌లో 16వ మూవీగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. RC16 వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో మల్లయుద్ధం కథతో ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
Jani Master : జానీ మాస్టర్‌కు షాకిచ్చిన జనసేన పార్టీ..
ఇక ఈ మూవీలో రామ్‌చరణ్ సరికొత్తగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం చరణ్ తన బాడీని బిల్డ్ చేసుకునే పనిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో రామ్‌చరణ్ తన లుక్‌కు సంబంధించిన ఓ ఫోటోను పోస్ట్ చేశాడు. బీస్ట్ మోడ్ ఆన్ అంటూ ఓ ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. ఈ పిక్‌లో చరణ్ తన ముఖం కనిపించకుండా వెనుకవైపుగా ఉన్న ఫోటోను పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్‌గా మారింది.
Movie Shooting Updates : ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుంది..? ఫౌజీ, మట్కాల సంగతేంటి?
View this post on Instagram