Virgin Boys : ‘వర్జిన్ బాయ్స్’ టీజర్ చూశారా? రొమాంటిక్ కామెడీ..
మీరు కూడా వర్జిన్ బాయ్స్ టీజర్ చూసేయండి..

Geetanand Mitraaw Sharma Virgin Boys Teaser Released
Virgin Boys : గీతానంద్, బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ జంటగా రాజ్ గురు ఫిలిమ్స్ బ్యానర్ పై రాజా దరపునేని నిర్మాతగా, దయానంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వర్జిన్ బాయ్స్’. శ్రీహాన్, రోనీత్, జెన్నిఫర్, అన్షుల, సుజిత్ కుమార్, అభిలాష్.. పలువురు కీలక పాత్రల్లో రొమాంటిక్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.
తాజాగా వర్జిన్ బాయ్స్ టీజర్ రిలీజ్ చేసారు. రొమాంటిక్ సీన్స్ తో పాటు ఫుల్ కామెడీ ఉండనుందని టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. యూత్ ని టార్గెట్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తవగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
Also Read : Prabhudeva : ప్రభుదేవా తమిళ్ సూపర్ హిట్ కామెడీ సినిమా.. ఇప్పుడు తెలుగులో.. ఏ ఓటీటీలోనో తెలుసా?
మీరు కూడా వర్జిన్ బాయ్స్ టీజర్ చూసేయండి..
టీజర్ లాంచ్ చేస్తూ నిర్మాత రాజా దరపునేని మాట్లాడుతూ.. ఈ సినిమా యూత్ కి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించాము. రొటీన్ కి భిన్నంగా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఉంటుంది ఈ సినిమా అని అన్నారు.